అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్: భారీ ఆఫర్లతో వస్తున్న మరొక సేల్..!!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను ప్రకటించింది.
ఈ అమెజాన్ సేల్ ఆగష్టు 6 నుండి ఆగష్టు 10 వరకూ జరగనుంది
ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన మంచి డీల్స్ ను కస్టమర్లు ఆశించవచ్చు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ ను ఆగష్టు 6 నుండి ఆగష్టు 10 వరకూ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే, ఎప్పటిలాగానే Prime Members కి ఈ సేల్ ఒకరోజు ముందు నుండే అందుబాటులో ఉంటుంది. అంటే, ఆగష్టు 5 నుండి ప్రైమ్ మెంబర్స్ ఈ సేల్ యాక్సెస్ ను పొందుతారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను SBI బ్యాంక్ సౌజన్యంతో నిర్వహిస్తోంది. అందుకే, SBI క్రెడిట్ కార్డ్ తో ప్రోడక్ట్స్ కొనుగోలుచేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Surveyగత నెలలో అమెజాన్ నిర్వహించిన ప్రైమ్ డే సేల్ ప్రకటించిన మరొక అతిపెద్ద సేల్ ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్. ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన మంచి డీల్స్ ను కస్టమర్లు ఆశించవచ్చు. ప్రైమ్ డే సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉండగా, ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మాత్రం అందరి కోసం తీసుకొచ్చింది. ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందించబోతున్నట్లు అమెజాన్ ఇప్పటికే టీజింగ్ కూడా మొదలు పెట్టింది.
అమెజాన్ ప్రకారం, గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ ఫోన్ల పైన మంచి డిస్కౌంట్ మరియు సెలెక్టెడ్ మొబైల్స్ పైన భారీ డిస్కౌంట్ ను అఫర్ చేయనుంది. ఇక ఎలక్ట్రానిక్స్ మరియు యాక్సెసరీస్ పైన గరిష్టంగా 75% వరకూ డిస్కౌంట్ ను అఫర్ చేయబోతున్నట్లు చెబుతోంది. అలాగే, అప్లయన్సెస్, హోమ్ & కిచెన్, ఫ్యాషన్ మరియు బ్యూటీ ప్రోడక్ట్స్ పైన కస్టమర్లు మంచి డిస్కౌంట్ అందుకోవచ్చని కూడా అమెజాన్ సెల్ బ్యానర్ పేజ్ ద్వారా వెల్లడించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile