జియోకి ఎయిర్టెల్ కౌంటర్ : ఆండ్రాయిడ్ సెటాప్ బాక్స్, HD LED టీవీ ఉచితంగా ఇవ్వనుంది

జియోకి ఎయిర్టెల్ కౌంటర్ : ఆండ్రాయిడ్ సెటాప్ బాక్స్, HD LED టీవీ ఉచితంగా ఇవ్వనుంది
HIGHLIGHTS

ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు చండీగఢ్ వంటి రాష్ట్రాలలో దీని పరిక్షలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.

టెలికం రంగంలో జియోతో పోటీని కొనసాగిస్తున్న ఎయిర్టెల్ సంస్థ, ఇప్పుడు జియో గిగా ఫైబర్ కి కూడా పోటీగా తన సేవలను అందించాడని సిద్ధమవుతోంది. ఇటీవల, తన వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM ) లో రిలయన్స్ జియో, తన జియోఫైబర్ ఇంటర్నెట్ సర్వీసును వాణిజ్యపరంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాదు, ఇంటర్నెట్ సర్వీస్ యొక్క వార్షిక ప్రణాళికకు సభ్యత్వం పొందిన వారందరికీ ‘Freebie ’ అని పిలిచే ఒక ప్రణాలికను కూడా ప్రకటించింది. సంస్థ యొక్క వార్షిక ప్రణాళికలను ఎంచుకునే జియోఫైబర్ కస్టమర్లకు HD లేదా 4 K  LED టెలివిజన్ మరియు 4 K  సెట్-టాప్-బాక్స్ కూడా  ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఇప్పుడు, ఎయిర్టెల్ కూడా జియో కి పోటీగా ఇలాంటి ప్లాన్స్ మరియు ఆఫర్లను తీసుకురానుట్లు ప్రస్తుతం వస్తున్నాకొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, ఎయిర్టెల్ పోస్ట్ పైడ్ చందా, హోమ్ బ్రాడ్ బ్యాండ్ మరియు DTH సంయుక్త సమూహ ప్లాన్లను అందించాడని, టెస్టింగ్ చేస్తోంది. ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు చండీగఢ్ వంటి రాష్ట్రాలలో దీని పరిక్షలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఈ సర్వీసుల యొక్క సంవత్సర చందాదారుల కోసం ఉచితంగా ఆండ్రాయిడ్ – ఆధారితమైన సెటాప్ బాక్స్ మరియు HD LED టీవీలు కూడా   అందచేయనున్నట్లు కనిపిస్తోంది. అయితే, టీవీని మాత్రం ప్రీమియం ప్లాన్ ఎంచుకునే చందాదారులకు ఇవ్వనుంది. ఎయిర్టెల్ యొక్క ఈ ఆండ్రాయిడ్ సెటాప్ బాక్స్, OTT స్ట్రీమింగ్ సర్వీసులు మరియు మ్యూజిక్, గేమింగ్ తో పాటుగా మరిన్ని ప్రజానాలను అందించనుంది. జియో తన గిగా ఫైబర్ సర్వీసులను సెప్టెంబర్ 5 న ప్రారంభిస్తుండగా, ఎయిర్టెల్ కూడా సెప్టెంబర్ నెల చివరికల్లా ఈ సర్వీసులను తీసుకురానున్నట్లు అంచనావేస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo