ఆర్థిక సంక్షోభం 2.0: AI యుగంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు.!

HIGHLIGHTS

ఒకప్పుడు ఆర్థిక సంక్షోభం అంటే బ్యాంకుల పతనం లేదా స్టాక్ మార్కెట్ పతనం మాత్రమే గుర్తుకు వచ్చేవి

ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి

పెట్టుబడుల వ్యవస్థ పై AI ప్రభావం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి

ఒకప్పుడు ఆర్థిక సంక్షోభం అంటే బ్యాంకుల పతనం లేదా రియల్ ఎస్టేట్ బబుల్ లేదా స్టాక్ మార్కెట్ పతనం మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ, ఇప్పుడు మారిన కాలం మరియు టెక్నాలజీ తో ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. అదే AI ఆధారిత ఆర్థిక సంక్షోభం అని నిపుణులు సూచిస్తున్నారు. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగాలు, బిజినెస్ మోడల్స్ మరియు పెట్టుబడుల వ్యవస్థ పై AI ప్రభావం గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఆర్థిక సంక్షోభం 2.0:

భారత్‌ కు చెందిన ఐటీ సర్వీస్ రంగం ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, AI టూల్స్ రావడంతో వేలాది మంది చేసే పనులు ఇప్పుడు కేవలం కొన్ని సాఫ్ట్‌ వేర్ సిస్టమ్‌ లు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి. దాని ఫలితంగా ఐటీ నియామకాలు మందగిస్తుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ఐటీ సెక్టార్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నట్టు కూడా పలువురు చెబుతున్నారు.

ఈ విషయం పై ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే, AI వల్ల ఉద్యోగాల స్వరూపం మారవచ్చు. ముఖ్యంగా రొటీన్ సాఫ్ట్‌ వేర్, BPO(కాల్ సెంటర్), డేటా ప్రాసెసింగ్ వంటి రంగాలు ఎక్కువ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. కొన్ని విశ్లేషకులు రాబోయే ఐదేళ్లలో సంప్రదాయ ఐటీ సర్వీస్ బిజినెస్ మోడల్స్ పూర్తిగా మారిపోతాయని అంచనా వేస్తున్నారు.

Also Read: OnePlus Community Sale: వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ లను కూడా భారీ డిస్కౌంట్ తో అందుకోండి.!

అనుకూల అంశాలు

అయితే, ఇది పూర్తిగా ప్రతికూల దృశ్యం కాదు. AI కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తోంది. డేటా సైన్స్, AI మోడల్ డెవలప్‌మెంట్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన వారికి భారీ డిమాండ్ పెరుగుతోంది. భారతదేశం ఇప్పటికే AI స్టార్టప్‌లు, డేటా సెంటర్లు మరియు డిజిటల్ ఇన్నోవేషన్‌ లో పెట్టుబడులను పెంచుకుంటోంది.

నిజానికి భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సంక్షోభం బ్యాంకుల వల్ల కాకుండా టెక్నాలజీ మార్పులకు తగిన వేగంతో ఉద్యోగులు, సంస్థలు, ప్రభుత్వాలు సిద్ధం కాకపోవడం వల్ల రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే, AI ను చూసి భయపడటం కాదు, దానిని అర్థం చేసుకుని కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం సమయానుకూలమైన వ్యూహం గా మారింది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా AI కోసం ఉద్యోగ అవకాశాలు పెరగడం ప్రారంభం అయినట్లు కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న చాలా జాబ్స్ లో కూడా AI ని ఉపయోగించడం ఒక ప్రాథమిక అంశం గా మార్పు చెందే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఫ్యూచర్ కోసం సిద్ధంగా ఉండాలంటే, AI లో తగిన నైపుణ్యాలు నేర్చుకోవాలని నిపుణులు హితవు పలుకుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :