జియో లేటెస్ట్ అఫర్: రోజుకి రూ.11 ఖర్చుతో 3GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్

Updated on 01-Dec-2021
HIGHLIGHTS

ఈరోజు నుండి జియో తన ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ధర పెంచింది

జియో కొత్త ధరలు అమలులోకి వచ్చాయి

రోజుకి రూ.11 ఖర్చుతో 3GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్

ఈరోజు నుండి జియో కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇతర టెలికం సంస్థలతో పాటుగా జియో కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ధర పెంచింది. అయితే, పెరిగిన ధరల పైన కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం కూడా అందిరికి తెలుసు. అయితే, ఈ కొత్త ధరలు ఎన్ని రోజులు కొనసాగుతాయో వేచి చూడాల్సి ఉంటుంది. అయినా, జియో యొక్క ఒక ప్లాన్ రోజుకి రూ.11 ఖర్చుతో 3GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది.

అదే, జియో యొక్క పాత Rs.3499 Plan వన్ ఇయర్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్. ఇప్పుడు ఈ ప్లాన్ Rs.4,199 రూపాయలకు లభిస్తోంది. మరి ఈ ప్లాన్ అఫర్ చేసే ప్రయోజాలను చూద్దాం.                       

Jio Rs.4,199 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

అంటే, ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలలో ఎటువంటి మార్పు లేదు. కానీ, ఈ ప్లాన్ ధర మాత్రం 700 రూపాయలు పెరిగింది. ఇక తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ గా పేరొందిన Rs.599 మరియు Rs.2599 ఇప్పుడు Rs.719 మరియు Rs.2879 ధరకు లభిస్తున్నాయి. ఇక వీటి ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు.       

Jio Rs.719 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 168 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.2879 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 740 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, డిస్ని ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.   

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :