5G నెట్వర్క్ వస్తే 4G స్మార్ట్ ఫోన్లు ఆగిపోతాయా?

5G నెట్వర్క్ వస్తే 4G స్మార్ట్ ఫోన్లు ఆగిపోతాయా?
HIGHLIGHTS

చాలా రోజుల పాటు కొనసాగిన 5G స్పెక్ట్రమ్ ఎట్టకేలకు ముగిసింది

అతిత్వరలోనే 5G నెట్ వర్క్ సర్వీస్ లను ప్రారంభించనున్నట్లు టెలికం కంపెనీలు తెలిపాయి

5G నెట్‌వర్క్ వస్తే 4G స్మార్ట్‌ఫోన్‌లు ఆగిపోతాయా? అని ఇంటర్నెట్ లో చాలా మంది ప్రశ్నిస్తున్నారు

చాలా రోజుల పాటు కొనసాగిన 5G స్పెక్ట్రమ్ ఎట్టకేలకు ముగిసింది మరియు అతిత్వరలోనే 5G నెట్ వర్క్ సర్వీస్ లను ప్రారంభించనున్నట్లు టెలికం కంపెనీలు తెలిపాయి.  ఈ 5G స్పెక్ట్రమ్ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షల కోట్ల వ్యాపారం చేసింది మరియు వచ్చే 20 ఏళ్లకు ప్రభుత్వం 5జీ హక్కులను విక్రయించింది. రిలయన్స్ జియో రూ.88078 కోట్లు బిడ్ చేసి, ఈ వేలంలో హైఎస్ట్ బిడ్డర్ గా నిలిచింది. అయితే, ఇప్పుడు నెట్టింట్లో ఒక కొత్త ప్రశ్న వైరల్ గా మారింది. అదేమిటంటే, 5G నెట్‌వర్క్ వస్తే 4G స్మార్ట్‌ఫోన్‌లు ఆగిపోతాయా? అని ఇంటర్నెట్ లో చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి, 5G నెట్‌వర్క్ వస్తే 4G స్మార్ట్‌ఫోన్‌లు ఆగిపోతాయా? అనే ప్రశ్న ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి, ఇంతకు ముందు 2జీ, 3జీ, 4జీ నెట్ వర్క్ లు ఒకదాని తరువాత మరొకటి తరువాతి తరంగా విడుదలయ్యాయి. ఇప్పుడు మనం చూడబోతున్న 5G అనేది 4G కి నెక్స్ట్ జెనరేషన్, అదే 5th జనరేషన్. పదేళ్ల క్రితంమే మనకు 4జీ సేవలు ప్రారంభమయునా కూడా 2G లేదా 3G సేవలు ఇంత వరకూ ఆగిపోలేదు. ఇదే విధంగా 5G నెట్ వర్క్ వచ్చినా కూడా 4G సర్వీసులు కొనసాగుతాయి.

5G గురించి కంపెనీలు ఏమి చెబుతున్నాయి?

అన్ని టెలికం కంపెనీలు కూడా ఏక కంఠంతో 5G నెట్ వర్క్ వచ్చినా 4G ఆగదని చెబుతున్నాయి. మీ పాత 4G ఫోన్ గురించి మీరు చింతించాల్సిన పనిలేదు, వాటిని నిశ్చింతగా కొనసాగించవచ్చు. ముందుగా, దేశంలోని 13 ప్రధాన నగరాల్లో 5G సేవలు ప్రారంభమవుతున్నాయి. ఈ సర్వీస్ దేశం మొత్తం విస్తరించడానికి చాలా సమయం పడుతుంది. అందుకే, 5G వస్తే 4G ఆగిపోతుంది లేదా స్పీడ్ తగ్గి పోతుందా? అనే ప్రశ్నలను ప్రజలు గుప్పిస్తున్నారు. అయితే నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. మీరు మీ 4G ఫోన్‌ని సురక్షితంగా ఉపయోగించవచ్చు. అయితే, మీరు 5G నెట్‌వర్క్ కోరుకుంటే మీరు 5G ఫోన్ కి మారడం తప్పనిసరి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo