Action Figure Style 3D ఇమేజ్ క్రియేట్ చేయడం చిటికెలో పని.. జస్ట్ ఈ ప్రాంప్ట్ ఉంటే చాలు.!
Action Figure Style 3D ఇమేజ్ క్రియేట్ చేయడం చాలా సింపుల్
దీన్ని Bandai 3d model అన్ని పిలుస్తారు మరియు ఇది మనం ఇచ్చే ప్రాంప్ట్ ను బట్టి వస్తుంది
దీని కోసం అవసరమైన ప్రాంప్ట్ వంటి పూర్తి వివరాలు క్లియర్ గా అందించాము
Action Figure Style 3D ఇమేజ్ క్రియేట్ చిటికెలో పని అని మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈరోజు తెలుసుకోండి. కొంపతీసి ఈ యాక్షన్ ఫిగర్ స్టైల్ 3D ఇమేజ్ అంటే ఏమిటి అడుగుతారా ఏమిటి. అయినా పర్వాలేదు, ఈరోజు నేను ఇదేమిటో మరియు ఇది ఎలా క్రియేట్ చేయాలి మరియు దీని కోసం అవసరమైన ప్రాంప్ట్ వంటి పూర్తి వివరాలు క్లియర్ గా అందించాము.
SurveyAction Figure Style 3D ఇమేజ్ ఏమిటి?
ముందుగా ఈ ఇమేజ్ గురించి వివరాల్లోకి వెళితే గతంలో వచ్చిన గిబిలీ ఇమేజ్ మాదిరిగా ఇది కూడా ఒక కొత్త ఇమేజ్ ట్రెండ్. ఇది చూడటానికి మీ ఫోటో యొక్క మైనపు 3D బొమ్మలా ఉంటుంది. దీన్ని Bandai 3d model అన్ని పిలుస్తారు మరియు ఇది మనం ఇచ్చే ప్రాంప్ట్ ను బట్టి వస్తుంది. ఈ ఇమేజ్ ఎలా ఉండాలి మరియు ఎంత సైజులో ఉండాలో కూడా మనం నిర్ణయించవచ్చు. ఈ కొత్త ఇమేజ్ ట్రెండ్ ఆల్రెడీ ట్వీటర్,ఫేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై బాగా వైరల్ అయ్యింది.
Action Figure Style 3D ఎలా తయారు చేయాలి?
ఈ కొత్త ట్రెండ్ ఇమేజ్ క్రియేట్ చేయడం చాలా సులభం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని కనీ విని ఎరుగని వింతలు చూడాల్సి వస్తోంది. ఈ వింతల్లో యాక్షన్ ఫిగర్ స్టైల్ 3D ఇమేజ్ కూడా ఒకటి. మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే దీనికోసం ఎటువంటి ప్రత్యేకమైన యాప్స్ లేదా వెబ్ సైట్ లను వెతకాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది.

మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే మీరే సింపుల్ గా చిటికెలో ఈ ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. దీనికోసం మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో వున్న Gemini AI Nano Banana లేదా జెమినీ ఇమేజ్ క్రియేటర్ సహాయం చేస్తుంది. ఆఫ్ కోర్స్, Chat GPT లో కూడా ఈ ఇమేజ్ క్రియేట్ చేయవచ్చు అనుకోండి, కానీ గూగుల్ జెమినీ లో ఈ ఇమేజ్ మరింత వేగంగా మరియు మరింత క్రియేటివ్ గా ఉన్నట్లు మేమియు గమనించాము.
స్టెప్ బై స్టెప్ గైడ్
- మీ స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి జెమినీ ఎఐ ఓపెన్ చేయండి
- జెమినీ ఎఐ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ బటన్ క్లిక్ చేయండి
- ఇక్కడ మీకు నచ్చిన ఇమేజస్ ను అప్లోడ్ చేయండి
- అప్లోడ్ చేసిన ఇమేజ్ క్రింద మేము అందించిన ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేయండి
- ఇక్కడ మీకు మీరు కోరుకున్న యాక్షన్ ఫిగర్ స్టైల్ 3D ఇమేజ్ లభిస్తుంది
ఇమేజ్ కోసం అవసరమైన ప్రాంప్ట్ ఏమిటి?
ఇమేజ్ కోసం అవసరమైన ప్రాంప్ట్ ను ఇక్కడ అందిస్తున్నాను మీరు కాపీ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది.
“ Design a highly detailed 1/7 scale figurine of the characters from the provided picture, sculpted in a realistic style and showcased in a real-world setting. The figurine should be posed dynamically on a round, transparent acrylic base without any text. It is displayed on a modern wooden computer desk with a gold finish, neatly arranged with a grey monitor, keyboard, and small accessories such as a food bowl and a coffee mug. On the monitor, the ZBrush modeling workflow of the figurine is visible, highlighting intricate sculpting details, wireframes, and texture maps in progress. Beside the monitor, a Bandai-style toy packaging box is placed upright, featuring vibrant 2D illustrations of the characters in dynamic poses, with the original artwork faithfully represented.”
Also Read: Flipkart BBD Sale భారీ డీల్: 5 వేలకే 500W 5.1 Soundbar అందుకోండి.!
ఒకవేళ మీరు అందుకున్న ఇమేజ్ లో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కోరుకుంటే వచ్చిన ఇమేజ్ క్రింద మీరు కోరుకునే మార్పులు అందిస్తే కొత్త ఇమేజ్ అందిస్తుంది.