కొట్టేసిన ఖరీదైన స్మార్ట్ ఫోన్ తిరిగిచ్చిన దొంగ:ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 08 Apr 2021
HIGHLIGHTS
  • కొట్టేసిన ఫోన్ తిరిగిచిన దొంగ

  • షాకింగ్ న్యూస్

  • ఎందుకు రిటన్ ఇచ్చాడో చెప్పి షాకిచ్చిన దొంగ

కొట్టేసిన ఖరీదైన స్మార్ట్ ఫోన్ తిరిగిచ్చిన దొంగ:ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!
కొట్టేసిన ఖరీదైన స్మార్ట్ ఫోన్ తిరిగిచ్చిన దొంగ:ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

ఏ దొంగైనా సునాయాసంగా కొట్టేసిన ఖరీదైన ఫోన్ ను ఏంచేస్తాడు? దీనికి సింపుల్ సమాధానం అమ్మేస్తాడు. కానీ, నిన్న జరిగిన ఇటువంటి సంఘటన మాత్రం చాలా కొత్త క్లైమ్యాక్స్ తో ముగింసింది. మెట్రో స్టేషన్ నుండి బయటకి వస్తున్నా ఒక వ్యక్తి చేతిలో వున్నా ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను చాకచక్యంగా కొట్టేసి వెళ్ళిపోయిన దొంగ తిరిగొచ్చి ఆ వ్యక్తికి ఆ ఫోన్ ను తిరిగిచ్చాడు. అయితే, ఎందుకు ఆ దొంగ ఫోన్ తిరిగిచ్చాడు? అనే ప్రశ్న అందరిని తొలుస్తుంటే, దీనికి ఆ దొంగ ఇచ్చిన సమాధానం మరింత షాకిచ్చింది.

ఈ సంఘటన నోయిడాలో జరిగింది. ప్రముఖ వాణిజ్య జర్నలిస్ట్ దేబ్యాన్ రాయ్ నోయిడా సెక్టార్ 52 మెట్రో స్టేషన్ నుండి బయటకు వస్తుండగా, నీడలో నక్కి వున్న ఒక దొంగ అతని చేతిలోని కాస్ట్లీ సాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను లాక్కొని పరిగెత్తాడు. అయితే, వేంటనే తేరుకున్న దేబ్యాన్ రాయ్ అతని వెంట పరిగెత్తారు.

అయితే, ఆశ్చర్యకరంగా ఆ దొంగ వెనక్కు తిరిగి ఫోన్ ఓనర్ దేబ్యాన్ రాయ్ వద్దకు వచ్చి ఆ ఫోన్ తిరిగిచ్చి ఒక మాట చెప్పి క్షమాపణ చెప్పాడు. ఆ ఒక్క మాట ఏమిటంటే, మీ చేతిలో ఉన్నది Oneplus 9 Pro స్మార్ట్ ఫోన్ అనిపించింది. అందుకే కొట్టేసాను కానీ ఇది వేరే ఫోన్ అందుకే తిరిగిచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు.           

logo
Raja Pullagura

email

Web Title: a thief returned his stolen phone to the owner and said i thought oneplus 9 pro
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
DMCA.com Protection Status