6G ట్రయల్స్: 5G కంటే ఏకంగా 50 రేట్లు వేగం…ఎప్పుడొస్తుందంటే..!

6G ట్రయల్స్: 5G కంటే ఏకంగా 50 రేట్లు వేగం…ఎప్పుడొస్తుందంటే..!
HIGHLIGHTS

అతి వేగంగా అభివృద్ధిచెందుతున్న టెక్నాలజీ

5G సర్వీస్ తరువాత 6G చాలా త్వరగానే రావచ్చు

6G నెట్ వర్క్ కోసం ట్రయల్స్ ప్రారంభించింది

అతి వేగంగా అభివృద్ధిచెందుతున్న టెక్నాలజీ తీరు చూస్తుంటే, 5G సర్వీస్ తరువాత 6G చాలా త్వరగానే రావచ్చని అనిపిస్తోంది. వాస్తవానికి, ఇండియాలో 3G  వచ్చిన చాలా కాలానికి గానీ 4G సర్వీస్ అందుబాటులోకి రాలేదు. అయితే, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యాన్ని మరింత మెరుగుపరచడం కోసం ఈసారి ప్రభుత్వం ఇప్పటి నుండే 6G నెట్ వర్క్ కోసం ట్రయల్స్ ప్రారంభించింది.

దీనికోసం, టెలికం శాఖ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ C-DOT కు భాద్యతలను అప్పగించింది. తెలిసిన సమాచారం ప్రకారం, 6G నెట్ వర్క్  సంబంధించిన అన్ని టెక్నీకల్ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని టెలికం శాఖ C-DOT ఆదేశించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి, ఇప్పటికే  హువావే, LG మరియు శాంసంగ్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజాలు 6G కోసం పనిచేస్తున్నాయి. దీని అందించిన ఒక రిపోర్ట్ ప్రకారం 6G నెట్ వర్క్ 5G కంటే 50 రేట్లు వేగంగా ఉంటుంది. ఇక  6G టెక్నలాజి ఎప్పటికి వస్తుందనే విషయం పైన  చర్చించారు. 6G సాంకేతికత 2028 నుండి 2030 మధ్యలో అందివచ్చేఆవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అయితే, వాస్తవానికి ఇప్పటికి ఇండియాలో 4G నెట్ వర్క్ మాత్రమే అందుబాటులో వుంది మరియు రానున్న నెలల్లో 5G నెట్ వర్క్ వచ్చే అవకాశం వుంది. 5G నెట్ వర్క్ కోసం కొన్ని టెలికం సంస్థలు ఇప్పటికే నిర్విఘ్నంగా తమ టెస్టింగ్ ట్రయల్స్ ను కూడా నిర్వహించాయి. మరి 5G కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాకుండానే 6G నెట్వర్క్ కోసం ఎందుకు పనిచేస్తున్నారు? అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి, 6G విషయంలో ఇతర దేశాల కంటే వెనుకబడకుండా ఉండటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునట్లు కనిపిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo