67 లక్షల మంది ఇండేన్ LPG వినియోగదారుల ఆధార్ డేటా లీక్

HIGHLIGHTS

మేజర్ సెక్యూరిటీ లోపమే కారణంగా చేబుతున్నహ్యాకర్లు.

67 లక్షల మంది ఇండేన్ LPG వినియోగదారుల ఆధార్ డేటా లీక్

భారతీయ వెబ్సైట్ల మీద విరుచుకుపడటం హ్యాకర్లకి ఒక సాధారణ విషయంగా మారిపోయింది. ఇప్పటివరకు అనేక ఆధార్ డేటా లీక్స్ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసాయి, ఇప్పుడు అవన్నీ మరవక మునుపే, కోత్తగా మరొక ఆధార్ డేటా లీక్ వీలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఒక ఫ్రెంచ్ పరిశోధకుడైన ఎల్లియోట్ ఆల్డర్సన్, ఇండేన్ యొక్క అనుబంధిత డీలర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లతో అనుసంధానముగా వున్నా లక్షలాది మంది ఆధార్ నంబర్లను, ఒక మేజర్ సెక్యూరిటీ లోపం కారణంగా వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క సొంత LPG బ్రాండ్ కావడం విశేషం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, బాప్టిస్ట్ రాబర్ట్ పేరుగల ఈయన,ఆన్లైన్లో ఎల్లియోట్ ఆల్డర్సన్ గా చెలామణి అవుతారు మరియు ఈ లీక్ గురించి తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు. ఇందులో, 6.7 మిలియన్ల మంది డేటా లేక అయినట్లు తెలిపారు. "లోకల్ డీలర్ల అథంటికేషన్ లోని లోపం కారణంగా, పేర్లు, వారి అడ్రసులు మరియు వారి ఆధార్ నంబర్లు కూడా ఇండేన్ బయటకి వెల్లడిస్తున్నలు (లీకింగ్) వివరించారు. 

Elliot Aadhaar data leak intext.png

లీక్ విషయానికి ఋజువుగా చూపిస్తున్న స్క్రీన్ షాట్ ఇది

(via ఎల్లియోట్ ఆల్డర్సన్)

ఇది మాత్రమే కాదు దీని గురించి, ఇదంతా అబద్దమని కామెంట్ చివరికి ఋజువుగా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఇందులో చూపించారు. కానీ, ఆల్డర్సన్ దాదాపుగా 11,000డీలర్ల నుండి డేటాని పొందినట్లు చెప్పుకొచ్చారు. అయితే, అతనికి సంబంధించిన IP అడ్రెస్ ను ఇండేన్ బ్లాక్ చేసింది. అయితే, తమ నుండి ఎటువంటి ఆధార్ డేటా లీక్ జరగలేదని ఇండేన్ చేబుతోంది.  

 

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo