60Hz, 90Hz, 120Hz: మీ ఫోన్ లో ఉండే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ గురించి తెలుసా..!

60Hz, 90Hz, 120Hz: మీ ఫోన్ లో ఉండే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ గురించి తెలుసా..!
HIGHLIGHTS

డిస్ప్లే ని బట్టి ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ మారుతుంది

మంచి క్లారిటీ కావాలంటే మంచి డిస్ప్లే ఉండాలి

మీ బడ్జెట్ ని బట్టి డిస్ప్లే ఎంచుకోవాలి

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో వస్తున్న డిస్ప్లేలు 60Hz నుండి మొదలుకొని 90Hz మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ డిస్ప్లే వరకు వున్నాయి. అయితే, వీటి మధ్య గల వ్యత్యాసం ఏమిటో మీకు తెలుసా?. ఈ విషయం తెలుసుకోవడం వల్ల ఒక స్మార్ట్ ఫోన్ ను ఎంచుకునేప్పుడు ఎటువంటి డిస్ప్లే ఉండాలో తెలుస్తుంది. అందుకే, ఈ డిస్ప్లేల మధ్య గల వ్యత్యాసం గురించి ఈరోజు  తెలుసుకుందాం.               

అసలు డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేటు అంటే ఏమిటి?

మనం వాడే స్మార్ట్ ఫోన్లలో ఉండే స్క్రీన్ (డిస్ప్లే) యొక్క పిక్చెర్ కొలతలను రిఫ్రెష్ రేటు Hz లలో కొలుస్తారు. అంటే, ఒక సెకనుకు డిస్ప్లే రిఫ్రెష్ చేసే ఫ్రెమ్ రేటును Hz లలో కొలుస్తారు. ఒక వీడియో లేదా యానిమేషన్ మనం చూస్తున్నప్పుడు సెకనుకు మన స్క్రీన్ చేసే రిఫ్రెష్ రేటు కారణంగా మనం చూసే కంటెంట్, బ్లర్ లేదా చాలా స్పష్టంగా కనిపించడం వంటి లాభాలను ఇస్తుంది.

60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

ప్రస్తుతం, దాదాపుగా అన్ని స్మార్ట్ ఫోన్లలో 60Hz రిఫ్రెష్ రేటు కలిగిన డిస్ప్లేలను అందిస్తున్నారు. అంటే, ప్రస్తుతం మనం వాడుతున్న ఫోను 60Hz రిఫ్రెష్ రేటుకలిగిన డిస్ప్లే గా మనం చెప్పవచ్చు. ఒకవేళ మీరు ప్రత్యేకంగా 90 లేదా 120Hz రిఫ్రెష్ రేటు డిస్ప్లే కలిగిన స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేస్తే తప్పక మిగిలిన స్మార్ట్ ఫోన్లన్ని ఈ కోవకే చెందుతాయి.

వాస్తవానికి, మనం చూసే కంటెంట్ 24fps తో ఉంటుంది. ఇది నేరుగా 24Hz గా మాత్రం ఉండదు. అందుకే, 60Hz డిస్ప్లేలు బ్లూ-రే కంటెంట్ ను ప్లే చెయ్యడానికి కొంచెం  ఇబ్బంది పడతాయి మరియు  ఇవి కంటెంట్ ను విడివిడిగా మార్చి మనకు తక్కువ ఫ్రెమ్స్ తో చూపిస్తాయి. అందుకే మనకు ఈ 60Hz డిస్ప్లేల పైన రేసింగ్, వేగంగా నడిచే మూవీస్ వంటివి పూర్తి స్వచ్చతతో చూపించలేవు. కానీ, మనం సాధారణంగా చూసే కంటెంట్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ఉంటుంది.

90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కంటే ఉత్తమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. గేమింగ్ ని బాగా ఇష్టపడేవారికి ఈ డిస్ప్లే మంచిది. ఎందుకంటే, అధిక రిఫ్రెష్ రేట్ కారణంగా గేమ్ ఎట్టి పరిస్థితుల్లోను బ్లర్ అయ్యే అవకాశం ఉండదు. 90Hz ఇమేజ్ ను సెకనుకు 90 రేట్లు రెండర్ చేస్తుంది.

120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ప్రయోజనాలు

ప్రస్తుతానికి, కొన్ని స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఈ డిస్ప్లేని అఫర్ చేస్తున్నాయి. వీటిలో కంటెంట్ చూడడం నిజంగా పీక్స్ లో వుంటుంది. ఇది 24fps కంటెంట్ ను నేరుగా మరియు పూర్తి స్వచ్చతతో ప్రసారం చేస్తుంది. ఇక ఈ 120Hz డిస్ప్లేలో బ్లూ-రే వీడియోలు చాలా సున్నితంగా మరియు ఎటువంటి షట్టర్ లేకూండా ప్లే చేస్తుంది. ఇక గేమింగ్ విషయానికి వస్తే, ముఖ్యంగా PUBG వంటి గేమ్స్ ని అత్యధికమైన గ్రాఫిక్స్ తో అల్ట్రా హై డెఫినేషన్ లో ఆడవచ్చు. అంతేకాదు, మీకు ఈ డిస్ప్లే ఎక్కువ ఫ్రెమ్ రేటుతో ఉంటుంది కాబట్టి, ఎటువంటి లాగ్ మీకు కనిపించదు.

అయితే, ఈ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే లలో ఎటువంటి డిస్ప్లే వున్న స్మార్ట్ ఫోన్ ఎంచుకోవడం మంచిది అని మీరు ఆలోచిస్తూ ఉండవచు. ఇక్కడే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంచుకునే రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ని బట్టి మన బడ్జెట్ కూడా మారుతుంది. కేవలం కాలింగ్, యూట్యూబ్ వీడియోలు, నార్మల్ గేమింగ్ చేసే నార్మల్ యూజర్లకు 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే సరిపోతుంది. హెవీ గేమింగ్, హై క్వాలిటీ వీడియోస్ తోపాటుగా హెవీ యూజర్ల కోసం 90Hz లేదా 120Hz రిఫ్రెష్ రేట్ అవసరమవుతుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo