20+ Diwali WhatsApp విషెస్ మరియు వాట్సాప్ status డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.!

20+ Diwali WhatsApp విషెస్ మరియు వాట్సాప్ status డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.!

వెలుగుల పండుగ Diwali 2024 వచ్చేసింది. ముందుగా అందరికీ 2024 దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా మీకు ప్రియమైన వారి మనసు దోచుకునేలా శుభాకాంక్షలు తెలపడానికి ఆలోచిస్తుంటే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. 20+ Diwali WhatsApp విషెస్ మరియు వాట్సాప్ status డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

20+ Diwali WhatsApp Wishes

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ మీకు ప్రేమ మరియు లక్ష్మి దేవి ఆశీస్సులతో నిండిపోవాలి.

దీపాల దీపావళి మీ జీవితంలో ఆనందం, శాంతి మరియు గొప్ప ఆలోచనలు నింపాలని కోరుకుంటున్నాను!

ఈ దీపావళి పండుగ మీ ఇంటికి సుఖసంతోషాలు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను!

మీ కుటుంబంలో ప్రేమ, శాంతి మరియు క్షేమం సదా ఉండాలి, దీపావళి శుభాకాంక్షలు!

దీపాలతో నిండిన ఈ పండుగ లాగా, మీరు ఎల్లప్పుడూ కాంతివంతమైన జీవితం గడుపుతూ ఉండాలని కోరుకుంటున్నాను!

ఈ దీపావళి కి మీరు పొందే ఆనందం మీ జీవితంలో ఎప్పుడూ నిలిచి ఉండాలని ఆశిస్తున్నాను!

శుభదీపావళి! మీకు మరియు మీ కుటుంబానికి బోలెడన్ని శుభాలు మరియు మీ జీవితంలో అనేక అద్భుతమైన సంఘటనలు తలెత్తాలని కోరుకుంటున్నాను!

ఈ పండుగ మీకు ఆనందం, ఆరోగ్యం మరియు విజయాలను చేకూర్చాలని కోరుకుంటున్నాను, హ్యాపీ దీపావళి 2024 

మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం మరియు వెలుగు ఉంటుందని ఆశిస్తున్నాను! దీపావళి శుభాకాంక్షలు!

2024 దీపావళి మీ అందరికీ అనేక సంతోషాలు, ఆనందం మరియు శ్రేయస్సు తెచ్చి ఇస్తుంది!

2024 దీపావళి వేడుకలు మీ జీవితంలో కొత్త ఆశలు మరియు సంబరాలు తీసుకు రావాలని కోరుకుంటున్నాను!

మీరు ఎల్లప్పుడూ ఆనందంగా మరియు శాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. హ్యాపీ దీపావళి!

శుభదీపావళి! మీకు, మీ కుటుంబానికి మరియు మీ స్నేహితులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు!

ఈ దీపావళి మీకు కొత్త ఉత్సాహం, సంతోషం మరియు ఆరోగ్యం అందించాలని ఆశిస్తున్నాను!

మీ ఇంట్లో కాంతి మరియు ఆనందం ఎల్లప్పుడూ ఉండాలని ఈ 2024 దీపావళి పండుగ మీకు క్షేమం మరియు సంతోషం తీసుకురావాలని కోరుకుంటున్నాను!

ఈ దీపావళి పండుగ ఈరోజు మీరు కోరుకునే ప్రతి విషయంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను!

2024 దీపావళి పండుగ మీ జీవితంలో సిరి సంపదలు, ఆనందం మరియు ఆరోగ్యం తెస్తుందని కోరుకుంటున్నాను!

ఈ వెలుగుల పండుగ నుంచి మీ కష్టాలన్నీ దూరమవ్వాలని, ఈ పండుగ మీకు ఆయురారోగ్యం మరియు సంతోషం తెస్తుందని కోరుకుంటున్నాను!

ఈ దీపావళి పండుగ మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా  మరియు కోటి కాంతులతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను!

ఈ దీపావళి పండుగ మీకు మరియు మీ కుటుంబానికి సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని ఆశిస్తున్నాను!

మీ పట్ల శాంతి, కాంతి మరియు ఆనందం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ, 2024 దీపావళి శుభాకాంక్షలు!

Also Read: Nothing Phone (2a) Plus Community Edition ఫస్ట్ లుక్ విడుదల చేసిన కంపెనీ.!

2024 Diwali Status Download

దీపావళి పండుగ విషెస్ చెబుతూ వాట్సాప్ లో స్టేటస్ ను సెట్ చేసుకోవడానికి మంచి స్టేటస్ వీడియోస్ కోసం ప్రత్యేకమైన డెడికేటెడ్ సైట్స్ ఉన్నాయి. ఇందులో Pinterest కూడా ఒకటి ఇటువంటి సైట్ ల నుంచి చాలా స్టేటస్ వీడియోలు మరియు ఇమేజ్ లను డౌన్లోడ్ చేసుకొవచ్చు. 

అలాగే, మరింత సింపుల్ గా వీడియోలను డౌన్లోడ్ చేయాలనుకుంటే యూట్యూబ్ ను ఆశ్రయించవచ్చు. దీనికోసం Diwali 2024 WhatsApp status video అని టైప్ చేసి సెర్చ్ చేయండి. వచ్చిన వీడియో లలో మీకు నచ్చిన వీడియో లింక్ తో డైరెక్ట్ గా స్టేటస్ ను సెట్ చేసుకోండి. ఒకవేళ వీడియో ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇదే లింక్ తో యూట్యూబ్ డౌన్లోడర్ ద్వారా వీడియో డౌన్ లోడ్ చేసుకోండి.     

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile