మన సూపర్ మారియో మళ్ళీ వచ్చాడు

మన సూపర్  మారియో  మళ్ళీ  వచ్చాడు
HIGHLIGHTS

మన సూపర్ మారియో మళ్ళీ మనముందుకు వస్తోంది.

మన సూపర్  మారియో  మళ్ళీ  వచ్చాడు 

మీకు  సూపర్  మారియో  గుర్తుందా  ? ఎలా  మర్చిపోతారు  లెండి  అది మనందరి  ఫేవరెట్  గేమ్  కదా . ఈ ఆధునిక  కాలంలో  ఎన్ని  కొత్త  వీడియో  గేమ్స్  వచ్చిన ఒకప్పటి సూపర్  మారియో గేమ్  కున్న  క్రేజ్  అంతా  ఇంత  కాదు. అసలు  ఈ గేమ్  ని ఇష్టపడనివారు  ఉండరనే  చెప్పాలి.   వీడియో గేమ్ పార్లర్లు నడుస్తున్న  రోజుల్లో ఈ గేమ్ కొన్ని  కోట్ల  మందికి  మనస్సుకి తృప్తి  నిచ్చిన  గేమ్ . ఇంట్లోని టీవీల్లో సైతం ఈ గేమ్‌ను ఆడుకున్న  వారు ఎంతో  మంది . అయితే స్మార్ట్‌ఫోన్ ప్రవేశించిన తరువాత సూపర్ మారియోనే  కాదు  అద్భుతమైన  ఎన్నో  విషయాలు  మరుగున  పడిపోయాయి. అయితే  ఇప్పుడు  మళ్ళీ  మన  చిన్ననాటి  సంగతులు  గుర్తు  చేస్తూ మన సూపర్  మారియో  మళ్ళీ మనముందుకు  వస్తోంది. 
ఈ గేమ్ నుMarch 24, 2017 నుంచి ఆండ్రాయిడ్ వర్షన్ లో విడుదల చేసినట్టు సంస్థ తెలిపింది.ఇప్పటికే  వరల్డ్  లో   కొన్నిప్లేసెస్  లో ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో కూడా ఇక నుంచి సూపర్ మారియో రన్ అందుబాటులోకి వచ్చిందని కంపెనీ సగర్వముగా  తెలిపింది. 

ఈ సూపర్ మారియో గేమ్‌ను, చిన్న  చిన్న  మార్పులు  చేసి  అందుబాటులోకి తెచ్చింది. , గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ప్రీ రిజిస్టర్ ను అనౌన్స్  చేసింది. ఒకవేళ మీరు డౌన్లోడ్  చేసుకోవాలనుకుంటే    'పీకే మిర్రర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆండ్రాయిడ్ లో ఈ గేమ్ లాంచ్ తో పాటు ఐఓఎస్ లోనూ దీన్ని అప్ డేట్ చేశారు. ఐఓఎస్ లో మాదిరిగా ఆండ్రాయిడ్ లోనూ ఇది సక్సెస్ సాధిస్తుందని కంపెనీ ఆశిస్తోంది. 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo