ప్రజల మనసు గెలుచుకున్న Mahavatar Narsimha OTT లోకి ఎప్పుడు వస్తుందంటే.!
‘Mahavatar Narsimha’ (మహావతార్ నరసింహా) దేశవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటోంది
బాలీవుడ్ అతిరథుల సినిమాలను సైతం వెనక్కి నెట్టి 100 కోట్ల కలెక్షన్ మార్కెట్ దాటేసింది
ఈ సినిమా ఎప్పుడు OTT లో రిలీజ్ అవుతుందనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది
హంబలే ఫిలిమ్స్ సారధ్యంలో రూపుదిద్దుకున్న పౌరాణిక యానిమేటెడ్ సినిమా Mahavatar Narsimha (మహావతార్ నరసింహా) దేశవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటోంది. పెద్ద అంచనాలు లేకుండా సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ పౌరాణిక చిత్రం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ గా అవతరించింది. ఈ యానిమేటెడ్ భక్తీ కథా చిత్రం ఇప్పుడు బాలీవుడ్ అతిరథులు సినిమాలను సైతం వెనక్కి నెట్టి 100 కోట్ల కలెక్షన్ మార్కెట్ దాటేసింది. ఈ సినిమా నార్త్ బెల్ట్ లో ఇప్పుడు గొప్ప కలెక్షన్ సాధించే దిశగా నడుస్తుంది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా ఎప్పుడు OTT లో రిలీజ్ అవుతుందనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది.
SurveyMahavatar Narsimha OTT
ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా జూలై 25 వ తేదీ థియేటర్లలో పౌరాణిక చిత్రం ‘మహావతార్ నరసింహా’ విడుదలైన మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ పాజిటివ్ మౌత్ టాక్ మరియు ప్రజల పాజిటివ్ రివ్యూలతో ఈ సినిమా భారీగా స్క్రీన్ లను పెంచుకుంటూ భారీ హిట్ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ కొనసాగింది. కొనసాగడమే కాదు 100 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి భారతీయ యానిమేటెడ్ చిత్రం గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ వంటి ఐదు భాషల్లో రిలీజ్ చేయబడింది. ఈ సినిమా ఇప్పుడు నార్త్ బెల్ట్ లో గొప్ప రెస్పాన్స్ అందుకుని భారీగా ప్రదర్శించబడుతోంది. అయితే, మహావతార్ నరసింహా ఒటిటి రిలీజ్ డేట్ అని చెబుతూ ఇప్పుడు నెట్టింట్లో కొత్త కొత్త రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇవన్నీ కూడా కేవలం రూమర్లు మాత్రమే అందులో ఎటువంటి నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.
Also Read: Jio మరియు Airtel ని మించిన ఫ్రీ ఆఫర్ ప్రకటించిన BSNL టెలికాం.!
అంతేకాదు, ఈ సినిమా గురించి ఎటువంటి కట్టుకథలు నమ్మవద్దని మరియు ఈ సినిమా అఫీషియల్ అప్డేట్ తాము అందిస్తాయని చిత్ర యాజమాన్యం తెలిపినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు మరియు ఈ సినిమా సాగిపోతున్న తీరు చూస్తుంటే, ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీ లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ను హంబలే నిర్మాణ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు ఎదురు చూడాల్సిందే. లేదంటే, ఈ సినిమాను థియేటర్ లో వెంటనే చూసేయొచ్చు.