reports saying south start megastar Chiranjeevi coming on ott podcast
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగ లాంటి వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది కేవలం చిరు అభిమానులకే కాదు సినీ వర్గాల్లో కూడా అందరూ చర్చించే ఆసక్తికరమైన వార్త గా నిలిచింది. ఈ వార్త ఇప్పటికే సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది మరియు హాట్ టాపిగ్గా మారింది. ఎన్నో దశాబ్దాలుగా వెండితెరపై తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారని సరికొత్తగా ప్రచారం మొదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన ప్రత్యేకమైన పాడ్ కాస్ట్ లేదా టాక్ షో చేయనున్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ కార్యక్రమం సాధారణ ఇంటర్వ్యూ తరహాలో కాకుండా, చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన అనుభవాలను స్వయంగా ప్రేక్షకులతో పంచుకునే విధంగా ఉండవచ్చని సమాచారం. సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల నుంచి స్టార్ గా ఎదిగిన తీరు, ఎదురైన అనేక సవాళ్లు, ఇండస్ట్రీలోని మధుర జ్ఞాపకాలు వంటి ఇంకా ఎన్నో విషయాలు ఇందులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి.
ఇదే మనకు పెద్ద న్యూస్ అనుకుంటే, ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల చేపట్టనున్నట్లు వచ్చిన సమాచారం మరింత ఆసక్తికరమైన అంశంగా మారింది. మొదట మెగాస్టార్ చిరంజీవి జీవితం పై డాక్యుమెంటరీ చేసే ఆలోచన ఉన్నప్పటికీ, చిన్న స్థాయి నుంచి తన నటన మరియు ఓర్పుతో మెగాస్టార్ గా ఎదిగిన తీరును ప్రేక్షకులతో నేరుగా పంచుకునే పాడ్ కాస్ట్ ఫార్మాట్ వైపు ప్రాజెక్ట్ మారినట్టు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి.
అయితే, చిరంజీవి పాడ్ కాస్ట్ పై నెట్ ఫ్లిక్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా వెల్లడి కాలేదు. కాబట్టి, అధికారిక సమాచారం వచ్చే వరకు దీనిని కేవలం రూమర్స్ వార్త గా మాత్రమే చూడాలి. కానీ, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆయన కెరీర్‌లోని ఎన్నో తెలియని విషయాలను మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం లభించవచ్చు.
Also Read: HMD Vibe2 Pro 5G: ఆకట్టుకునే బడ్జెట్ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
వెండి తెరపై తనదైన స్టైల్ మరియు డాన్స్ తో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకోవడమే కాకుండా ఇప్పటికీ చెక్కు చెదరని ఫ్యాన్ బేస్ తో ఎవర్ గ్రీన్ మెగాస్టార్ గా తన అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న చిరంజీవి పాడ్ కాస్ట్ అంటే ఎంత హైప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.