రూ. 12,999 ధరలో స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్ చేసిన జీబ్రానిక్స్.!

HIGHLIGHTS

Zebronics ఇండియాలో కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ ను లాంచ్ చేసింది.

ZEBRONICS ZEB-PIXAPLAY 22 పేరుతో లాంచ్

1080p రిజల్యూషన్ తో పెద్ద స్క్రీన్ అందించ గలదని జీబ్రానిక్స్ తెలిపింది

రూ. 12,999 ధరలో స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్ చేసిన జీబ్రానిక్స్.!

ప్రముఖ ఆడియో బ్రాండ్ Zebronics ఇండియాలో కొత్త స్మార్ట్ ప్రొజెక్టర్ ను లాంచ్ చేసింది. ZEBRONICS ZEB-PIXAPLAY 22 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ను కేవలం రూ. 12,999 ధరలో ప్రకటించింది. ఈ జీబ్రానిక్స్ స్మార్ట్ ప్రొజెక్టర్ చూడటానికి చిన్నగా ఉన్న 1080p రిజల్యూషన్ తో పెద్ద స్క్రీన్ అందించ గలదని జీబ్రానిక్స్ తెలిపింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్ ధర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS ZEB-PIXAPLAY 22 : ధర 

ZEBRONICS ZEB-PIXAPLAY 22 ను జీబ్రానిక్స్ ఇండియాలో రూ. 12,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ పైన గొప్ప ఆఫర్లను కూడా కంపెనీ అందించింది. అమెజాన్ నుండి ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ను కేవలం రూ. 1,186 అతి తక్కువ EMI అప్షన్ తో కూడా డెబిట్ కార్డ్ ద్వారా కూడా పొందే వీలుందని, అమెజాన్ తెలిపింది. 

ZEBRONICS ZEB-PIXAPLAY 22: స్పెక్స్ 

ఈ జీబ్రానిక్స్ స్మార్ట్ ప్రొజెక్టర్ బిల్ట్ ఇన్ స్పీకర్ మరియు క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. ఈ ప్రొజెక్టర్ తో 406cm, అంటే దాదాపు 159 ఇంచ్ వరకూ బిగ్ స్క్రీన్ ను పొందవచ్చు. ఈ ప్రొజెక్టర్ డ్యూయల్ బ్యాంక్ Wi-Fi, Casting మరియు స్క్రీన్ మిర్రర్ లకు కూడా సపోర్ట్ చేస్తుంది. 

ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ USB, HDMI, మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లతో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ Flipkart మరియు zebronics.com నుండి సేల్ లభిస్తోంది. అయితే, కంపెనీ అధికారిక సైట్ పైన మాత్రం ఈ స్మార్ట్ ప్రొజక్టర్ ధర రూ. 37,999 రూపాయలుగా చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo