ZEBRONICS launches 11.2.4 Dolby Atmos soundbar in market
ఆడియో డివైజెస్ విభాగంలో, ముఖ్యంగా బడ్జెట్ సౌండ్ బార్ విభాగంలో తనదైన ముద్ర వేసిన ZEBRONICS, ఈరోజు భారత మార్కెట్లో సరికొత్త 11.2.4 Dolby Atmos సౌండ్ బార్ ని లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ని ఏకంగా 1610W అవుట్ పుట్ సౌండ్ తో లాంచ్ చేసింది. ఇది ఇంటిని మాత్రమే కాదు ఏకంగా స్ట్రీట్ మొత్తం షేక్ చేసే సత్తా కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. జెబ్రోనిక్స్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
జెబ్రోనిక్స్ ఈ సౌండ్ బార్ ని Juke Bar 11000 మోడల్ పేరుతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ను ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం ధరలో లాంచ్ చేసింది. రూ. 69,999 ప్రీమియం ధరలో జెబ్రోనిక్స్ ఈ సౌండ్ బార్ ని లాంచ్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ లాంచ్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ తక్కువ ధరలో లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై రూ. 9,500 రూపాయల భారీ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 60,499 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి కూడా సేల్ అవుతోంది. అయితే బ్యాంక్ ఆఫర్స్ లో మార్పు ఉంటుంది.
Also Read: vivo T5 5G First Sale నుంచి బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తున్న వివో.. ప్రైస్ అండ్ ఆఫర్స్ చూద్దామా.!
జెబ్రోన్సిక్ ఈ కొత్త సౌండ్ బార్ ను చాలా ప్రీమియం డిజైన్ మరియు స్పీకర్ సెటప్ తో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ చాలా ప్రీమియం అండ్ పవర్ ఫుల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు 3 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్, పైన 6 అప్ ఫైరింగ్ స్పీకర్ మరియు సైడ్ లో రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ ఉంటుంది. అంటే, ఇది ముందు, పెయిన్ మరియు సైడ్ నుంచి కూడా సౌండ్ ను ప్రొడ్యూస్ చేస్తుంది.
అలాగే, ఈ సెటప్ తో వచ్చే డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ లో ముందు మరియు పైన అప్ ఫైరింగ్ స్పీకర్ ఉంటాయి. ఇది కూడా ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ సౌండ్ అందిస్తుంది. ఇక చివరిగా ఈ సౌండ్ బార్ తో గొప్ప డీప్ బాస్ సౌండ్ అందించే డ్యూయల్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో 1610W RMS జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ తో సరికొత్త మ్యాగ్నెటిక్ స్నాప్ రిమోట్ ని కూడా అందించింది.
ఇక సౌండ్ టెక్ పరంగా, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు DTS:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ టెక్ మరియు స్పీకర్ సెటప్ తో ఇది థియేటర్ స్థాయి సౌండ్ ఆఫర్ చేస్తుందని జెబ్రోనిక్స్ పేర్కొంది. మరో మంచి విషయం ఏమిటంటే ఇది పూర్తిగా వైర్లెస్ సెటప్ తో వస్తుంది. అలాగే HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఇది కాకుండా ఈ సౌండ్ బార్ వాల్ మౌంట్ ఫీచర్, UHF మైక్ మరియు కంప్లీట్ కేబుల్స్ ను కూడా బాక్స్ లో అందిస్తుంది.