ViewSonic Projectors: Xbox సపోర్ట్ తో వచ్చిన మొదటి ప్రొజెక్టర్..ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

ViewSonic ఇండియాలో కొత్త ప్రొజెక్టర్ లను విడుదల చేసింది

X1-4K మరియు X2-4K LED మోడల్ నెంబర్ లతో తీసుకు వచ్చింది

ఈ కొత్త ప్రొజెక్టర్స్ Xbox కోసం డిజైన్ చేయబడిన ప్రపంచంలోనే మొదటి ప్రొజెక్టర్

ViewSonic Projectors: Xbox సపోర్ట్ తో వచ్చిన మొదటి ప్రొజెక్టర్..ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

ప్రముఖ ప్రొజెక్టర్ తయారీదారు ViewSonic ఇండియాలో కొత్త ప్రొజెక్టర్ లను విడుదల చేసింది. X1-4K మరియు X2-4K LED మోడల్ నెంబర్ లతో తీసుకు వచ్చింది. ఈ కొత్త ప్రొజెక్టర్స్ ఎక్కువ కాలం మన్నగల మరియు క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ ను అందించ గల సత్తా కలిగి ఉన్నట్లు వ్యూసోనిక్ తెలిపింది. ఈ కొత్త ప్రొజెక్టర్స్ Xbox కోసం డిజైన్ చేయబడిన ప్రపంచంలోనే మొదటి ప్రొజెక్టర్ అవుతుందని కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ కొత్త ప్రొజెక్టర్స్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ViewSonic Projectors

వ్యూసోనిక్ తీసుకు వచ్చిన ఈ కొత్త ప్రొజెక్టర్స్, 1440p 120Hz రిఫ్రెష్ రేట్ తో డిటైల్డ్ మరియు లీనమయ్యే Xbox గేమింగ్ ను కోరుకునే గేమర్స్ కు తగిన విధంగా తీసుకు వచ్చింది. ఈ ప్రొజెక్టర్స్ అద్భుతమైన వివరాలతో కూడిన విజువల్స్ ను 100 ఇంచ్ సైజులో అందిస్తాయి. X1-4K మరియు X2-4K రెండు ప్రొజెక్టర్స్ కూడా 4K UHD విజువల్స్ ను లార్జ్ స్క్రీన్ పైన అందిస్తాయి.

ViewSonic Projectors

ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా Xbox-exclusive రిజల్యూషన్ మరియు రిఫ్రెష్ రేట్ సమ్మిళిత సపోర్ట్ లను అందిస్తాయి. అంటే, 4.2ms Ultra-Fast Input మరియు 240Hz రిఫ్రెష్ రేట్ తో అద్భుతమైన గేమ్ ప్లే అనుభూతిని అందిస్తాయి. ఈ ప్రొజెక్టర్స్ 2,900 Lumens బ్రైట్నెస్ తో క్రిస్టల్ క్లియర్ విజువల్స్ ను అందిస్తాయి మరియు 30,000 గంటల లైఫ్ స్పెన్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రొజెక్టర్స్ లో అందించిన Harman Kardon స్పీకర్స్ తో మంచి సౌండ్ ను కూడా ఆస్వాదించవచ్చు.

Also Read : boAt Upcoming Buds: 45 గంటల ప్లేటైమ్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్.!

X1-4K & X2-4K : Price

వ్యూసోనిక్ లాంచ్ చేసిన ఈ కొత్త ప్రొజెక్టర్స్ ప్రైస్ విషయానికి వస్తే, వ్యూసోనిక్ X1-4K ప్రొజెక్టర్ రూ. 2,99,000 ధరతో అందించగా, వ్యూసోనిక్ X2-4K LED ప్రొజెక్టర్ కోసం రూ. 3,25,000 రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo