Skullcandy offers rs 17000 huge discount code offer on Dime Evo earbuds
ఈ Code అప్లై చేస్తే 19 వేల రూపాయల Skullcandy ఇయర్ బడ్స్ ని కేవలం రూ. 2,999 ధరకే పొందొచ్చని మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈరోజు తెలుసుకోండి. ప్రముఖ అమెరికన్ ఆడియో పరికరాల బ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా వెలుగొందుతున్న స్కల్‌క్యాండీ ఇండియాలో గత సంవత్సరం విడుదల చేసిన ప్రీమియం బడ్స్ Dime Evo ఇయర్ బడ్స్ ని ప్రస్తుతం రూ. 17,000 రూపాయల భారీ Code ఆఫర్ తో కేవలం రూ. 2999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ ఆఫర్ ని కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి అందించడం విశేషం.
ఇండియాలో స్కల్‌క్యాండీ రీసెంట్ గా లాంచ్ చేసిన ప్రీమియం ఇయర్ బడ్స్ డైమ్ ఈవో ఇయర్ బడ్స్ పై ఇప్పుడు రూ. 17,000 రూపాయల భారీ డిస్కౌంట్ కోడ్ ఆఫర్ అందించింది. స్కల్‌క్యాండీ ఈ ఇయర్ బడ్స్ ను రూ. 19,999 రూపాయల MRP ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది.
అయితే, ప్రస్తుతం ఈ బడ్స్ ను “Use Code: TWDE” కోడ్ ఉపయోగించి కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి కొనుగోలు చేసే వారికి రూ. 17,000 భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 2,999 రూపాయల అతి చవక ధరలో అందిస్తోంది. ఈ కార్ట్ ప్లాట్ ఫామ్స్ కంటే కూడా ఈరోజు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి కోడ్ డిస్కౌంట్ అఫర్ ఈ బడ్స్ అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి.
Also Read: OnePlus N6x: వన్ ప్లస్ N సిరీస్ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కన్ఫర్మ్.!
స్కల్‌క్యాండీ Dime Evo ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ స్టైలిష్ డిజైన్ తో పాటు శక్తివంతమైన ఆడియో అనుభూతిని అందించే TWS ఇయర్ బడ్స్ గా చెప్పబడుతుంది. ఈ బడ్స్ లో 6mm డైనమిక్ స్పీకర్ సెటప్ కలిగి మంచి క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. అలాగే, స్కల్‌క్యాండీ యాప్ ద్వారా 5 బ్యాండ్ కస్టమ్ ఈక్వలైజర్ 3 ప్రీసెట్ EQ మోడ్‌లు (Music, Bass Boost,Podcast) మరియు బటన్ కంట్రోల్స్ ను మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకునే అవకాశం ఈ బడ్స్ లో అందించింది.
ఈ బడ్స్ బ్లూటూత్ 5.3, గూగుల్ ఫాస్ట్ పెయిర్, మల్టీ పాయింట్ పెయిరింగ్ సపోర్ట్ ఉండటంతో ఒకేసారి రెండు పరికరాలకు కనెక్ట్ అవ్వవచ్చు. ఇందులో క్లియర్ వాయిస్ స్మార్ట్ మైక్, నేచురల్ వాయిస్ సైడ్ టోన్, Stay-Aware Mode, లో లెటెన్సీ మోడ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ఈ బడ్స్ రోజువారీ వినియోగాన్ని మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.
బ్యాటరీ విషయానికి వస్తే, ఈ బడ్స్ ను ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే బడ్స్ తో 8 గంటల ప్లే టైమ్ మరియు ఛార్జింగ్ కేస్ తో కలిపి మొత్తం 36 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ర్యాపిడ్ ఛార్జ్ టెక్నాలజీ వల్ల కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో సుమారు 2 గంటల ప్లేబ్యాక్ పొందవచ్చు. ఈ బడ్స్ IPX4 Sweat అండ్ Water Resistance రేటింగ్ తో వ్యాయామం, ట్రావెల్ లేదా తేలికపాటి వర్షంలో కూడా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి.