Samsung Galaxy Buds 3 FE: గెలాక్సీ AI మరియు మెరుగైన ANC తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

శాంసంగ్ లేటెస్ట్ బడ్జెట్ ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది

Samsung Galaxy Buds 3 FE ప్రీమియం డిజైన్ తో వస్తుంది

ఈ ఇయర్ బడ్స్ ను గెలాక్సీ AI మరియు మెరుగైన ANC తో లాంచ్ చేసింది

Samsung Galaxy Buds 3 FE : శాంసంగ్ లేటెస్ట్ ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ ను గెలాక్సీ AI మరియు మెరుగైన ANC తో లాంచ్ చేసింది. ఇది ప్రీమియం సెగ్మెంట్ ఇయర్ బడ్స్ మరియు ప్రీమియం డిజైన్ తో వస్తుంది. శాంసంగ్ కొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Samsung Galaxy Buds 3 FE: ప్రైస్

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE ఇయర్ బడ్స్ ని రూ. 12,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ వచ్చే వారం నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ ను గెలాక్సీ స్మార్ట్ ఫోన్ లతో పాటు జతగా కొనుగోలు చేసే యూజర్లకు రూ. 4,000 వరకు ప్రయోజనం చేకూరుతుందని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ పై రూ. 3,000 రూపాయల క్యాష్ బ్యాక్ మరియు అప్‌గ్రేడ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.

Also Read: OPPO F27 Pro+: 11 వేల భారీ డిస్కౌంట్ తో కేవలం 16 వేల ధరలో లభిస్తోంది.!

Samsung Galaxy Buds 3 FE: ఫీచర్స్

శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE గొప్ప సౌండ్ అందించే పెద్ద స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇది కస్టమ్ ఈక్వలైజర్ మరియు 360 డిగ్రీల ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ శాంసంగ్ ఇయర్ బడ్స్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ తో సూపర్ సైలెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. అంటే, బయట నుంచి వచ్చే ధ్వనులను తగ్గించి మంచి లీనమయ్యే సౌండ్ మరియు కాలింగ్ ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ లో చాలా సులభమైన జెశ్చర్ కంట్రోల్ ను కూడా అందించింది.

ఇది క్విక్ పెయిర్ మరియు ఆటో స్విచ్ ఫీచర్స్ తో మంచి కనెక్టివిటీ కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE ఈజీ పెయిరింగ్, శాంసంగ్ ఫైండ్, జెమినీ వాయిస్ వేకప్ మరియు యాంబియంట్ సౌండ్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 3 FE బడ్స్ టోటల్ 30 గంటల ప్లే టైమ్ ఆఫర్ చేస్తుంది మరియు IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :