Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.. ఎక్కడంటే.!

HIGHLIGHTS

Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది

డాల్బీ ఆడియో మరియు DTS Virtual-X సౌండ్ టెక్నాలజీ కలిగిన శాంసంగ్ సౌండ్ బార్

ఈ సౌండ్ బార్ ప్రైస్ ఎంత వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి

Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో మరియు DTS Virtual-X సౌండ్ టెక్నాలజీ కలిగిన శాంసంగ్ సౌండ్ బార్. ఇది 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ఇంటిని షేక్ చేసే 490W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు మంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం మీ ముందుంది. ఈ సౌండ్ బార్ ఆఫర్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ సౌండ్ బార్ ప్రైస్ ఎంత వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్ ఎక్కడ లభిస్తోంది?

ఈ సౌండ్ బార్ ఆఫర్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మీకు అందుబాటులో ఉంది. శాంసంగ్ 5.1 ఛానల్ సౌండ్ బార్ HW-B67EF/XL మోడల్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ని ఈ రోజు 50% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 19,990 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను UPI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ సౌండ్ బార్ కేవలం రూ. 18,051 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

Samsung 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ శాంసంగ్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన స్లీక్ బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో 490W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో వస్తుంది మరియు వన్ రిమోట్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో మరియు DTS Virtual-X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ అడాప్టివ్ సౌండ్, వాయిస్ ఎం హెన్స్మెంట్ మరియు Q సింఫనీ వంటి ప్రత్యేకమైన శాంసంగ్ సౌండ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. కనెక్టవిటీ పరంగా, ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ వంటి మల్టి కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఇటీవల ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన GOAT Sale లో ఈ సౌండ్ బార్ సేల్ అయిన ప్రైస్ కంటే కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ సౌండ్ బార్ మీకు లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :