Realme Buds N1: సెప్టెంబర్ 9 న కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!
: రియల్ మీ ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ ను విడుదల చేస్తోంది
ఈ అప్ కమింగ్ బడ్స్ 46dB హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తున్నాయి
రియల్ మీ అప్ కమింగ్ బడ్స్ ను సెప్టెంబర్ 9 న విడుదల చేస్తుంది
Realme Buds N1: రియల్ మీ ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ ను విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ 46dB హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ బడ్స్ కోసం అందించిన టీజర్ పేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ బడ్స్ ప్రత్యేకతలు మరియు మరిన్ని ఫీచర్లు వివరాలు కూడా అందించింది.
SurveyRealme Buds N1: లాంచ్
రియల్ మీ అప్ కమింగ్ బడ్స్ ను సెప్టెంబర్ 9 న విడుదల చేస్తుంది. ఈ బడ్స్ ను అమెజాన్ సేల్ పార్ట్నర్ గా తీసుకు వస్తోంది. అందుకే, ఈ బడ్స్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ బడ్స్ ఫీచర్స్ ను కూడా అందించింది.
Experience the power of pure sound with #realmeBudsN1🎧
— realme (@realmeIndia) September 3, 2024
46dB Hybrid Noise Cancellation ensures you stay focused and in the zone. Ready to level up your game?
Launching 9th September, 12 Noon
Know more: https://t.co/275mcjgwrz#NoiseOffGameOn pic.twitter.com/oAI5cXufyW
Also Read: Spatial Head Tracking ఫీచర్ మరియు 50dB ANC తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన బోట్.!
Realme Buds N1: ఫీచర్స్
రియల్ మీ అప్ కమింగ్ బడ్స్ N1 ను 46dB హైబ్రిడ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ బడ్స్ 360 స్పెటియల్ ఆడియో ఎఫెక్ట్ తో కూడా వస్తుందట. రియల్ మీ ఈ బడ్స్ ను 12.4 mm డైనమిక్ బాస్ డ్రైవర్స్ (స్పీకర్) లతో అందిస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ బడ్స్ ఈ స్పీకర్ లతో డైనమిక్ సౌండ్ ఎఫెక్ట్ అందిస్తుందని కూడా రియల్ మీ వెల్లడించింది.

ఈ అప్ కమింగ్ బడ్స్ కలిగిన బ్యాటరీ వివరాలను కూడా రియల్ మీ ముందే తెలిపింది. రియల్ మీ బడ్స్ ఎన్ 1 ఇయర్ బడ్స్ ను 40 గంటల ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ తో అందిస్తున్నట్లు ప్రకటించింది. రియల్ మీ ఈ అప్ కమింగ్ బడ్స్ ను IP55 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంటెన్స్ ఫీచర్ తో కూడా లాంచ్ చేస్తోంది. రియల్ మీ బడ్స్ ఎన్ 1 కోసం అందించే టీజర్ పేజి నుంచి ఈ బడ్స్ యోక్క గ్రీన్ కలర్ వేరియంట్ ను టీజ్ చేసింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
