Spatial Head Tracking ఫీచర్ మరియు 50dB ANC తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన బోట్.!

HIGHLIGHTS

బోట్ కొత్త boAt Nirvana Ivy బడ్స్ ను విడుదల చేసింది

ఈ బడ్స్ ను Spatial Head Tracking మరియు 50dB ANC ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ బడ్స్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో బోట్ అందించింది

Spatial Head Tracking ఫీచర్ మరియు 50dB ANC తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన బోట్.!

ప్రముఖ దేశీయ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ బోట్ కొత్త boAt Nirvana Ivy బడ్స్ ను విడుదల చేసింది. ఈ బడ్స్ ను Spatial Head Tracking ఫీచర్ మరియు 50dB ANC వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేసింది. స్వదేశీ టెక్ తో మంచి యూజర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్న బోట్ ఈ కొత్త బడ్స్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో అందించిందని చెప్పవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt Nirvana Ivy : ఫీచర్స్

ఈ బడ్స్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో బోట్ అందించింది. ఈ బోట్ కొత్త బడ్స్ ను స్పెటియల్ ఆడియో మరియు డైనమిక్ హెడ్ టాకింగ్ ఫీచర్ తో అందించింది. ఇది 3D ఆడియో ఎక్స్ పీరియన్స్ ను లీనమయ్యే సౌండ్ ను అందిస్తుందట. ఇక ఈ బడ్స్ పూర్తి వివరాల్లోకి వెళితే, ఈ బడ్స్ బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించే 11mm స్పీకర్ లతో అందించింది.

boAt Nirvana Ivy Spatial Head Tracking Buds

ఇది మల్టీ పాయింట్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ బడ్స్ ఇన్ ఇయర్ డిటెక్షన్, 60ms బీస్ట్ మోడ్, నచ్చిన విధంగా ఆడియో ని సెట్ చేసుకునే boAt Hearables App సపోర్ట్ తో అందించింది. అంతేకాదు, ఈ బడ్స్ 50dB హైబ్రెడ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ బోట్ నిర్వాణా ఐవి ఇయర్ బడ్స్ టోటల్ 50 గంటల ప్లే బ్యాక్ అందిస్తుందని బోట్ తెలిపింది. అంతేకాదు, ASAP ఛార్జ్ టెక్ తో 10 నిమిషాల్లో 240 నిమిషాల ప్లే బ్యాక్ అయ్యే ఛార్జ్ ను సమకూర్చుకుంటుందని కూడా బోట్ తెలిపింది.

Also Read: రూ. 3,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మొదలైన vivo T3 Pro 5G ఫస్ట్ సేల్.!

boAt Nirvana Ivy : ధర

బోట్ ఈ బడ్స్ ను కేవలం రూ. 2,999 ధరలో విడుదల చేసింది. ఈ బడ్స్ ను బోట్ అధికారిక వెబ్సైట్ boat-lifestyle.com మరియు Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile