Realme Buds Air 6 Pro: కొత్త బడ్స్ తెచ్చిన రియల్ మీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

Realme GT6 తో పాటుగా రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ప్రో ని కూడా విడుదల చేసింది

Realme Buds Air 6 Pro బడ్స్ Hi-Res LDAC సర్టిఫికేషన్ తో వస్తుంది

రియల్ మీ ఈ బడ్స్ ను ప్రీమియం ఫీచర్ లతో కూడా అందించింది

Realme Buds Air 6 Pro: కొత్త బడ్స్ తెచ్చిన రియల్ మీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

Realme Buds Air 6 Pro: నిన్న భారత మార్కెట్లో రియల్ మీ కొత్త ప్రోడక్ట్ లను విడుదల చేసింది. Realme GT6 ఫ్లాగ్ షిప్ ఫోన్ తో పాటుగా రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ప్రో ని కూడా నిన్న విడుదల చేసింది. ఈ బడ్స్ ను పవర్ ఫుల్ సౌండ్ అందించగల స్పీకర్లు, ANC మరియు Hi-Res ఆడియో సపోర్ట్ తో అందించింది. రియల్ మీ సరికొత్తగా తీసుకువచ్చిన ఈ కొత్త బడ్స్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Buds Air 6 Pro: ధర

రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ప్రో ఇయర్ బడ్స్ ను రూ. 4,999 ధరతో విడుదల చేసింది. ఈ బడ్స్ ను రియల్ మీ అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఈ బడ్స్ ఫస్ట్ సేల్ జూన్ 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది.

Realme Buds Air 6 Pro: ఫీచర్లు

రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ప్రో ఇయర్ బడ్స్ ను Hi-Fi క్వాలిటీ డ్యూయల్ డ్రైవర్స్ తో అందించినట్లు రియల్ మీ తెలిపింది. ఇందులో, 11 BASS స్పీకర్ మరియు 6mm మైక్రో ప్లానర్ ట్వీటర్ లు ఉన్నాయి. ఈ బడ్స్ అద్భుతమైన వివరాలతో సౌండ్ అందిస్తుందని రియల్ మీ తెలిపింది.

Realme Buds Air 6 Pro Features
Realme Buds Air 6 Pro Features

రియల్ మీ ఈ బడ్స్ ను ప్రీమియం ఫీచర్ లతో కూడా అందించింది. ఈ బడ్స్ Hi-Res LDAC సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు హై క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ క్లారిటీ మరియు క్లియర్ సౌండ్ అందించడానికి వీలుగా పర్సనలైజ్డ్ ఆడియో అల్గారిథం ఫీచర్ తో వస్తుంది.

Also Read: లేటెస్ట్ Mini QLED Smart Tv పై భారీ డిస్కౌంట్ మరియు ఉచిత Fire Tv Stick కూడా అందుకోండి.!

ఈ రియల్ మీ కొత్త బడ్స్ 360° స్పెటియల్ ఆడియో ఎఫెక్ట్, డైనమిక్ బాస్ బూస్ట్ మరియు 50dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) వంటి ఫీచర్ లతో మరింత ఆకట్టుకుంటుంది. అలాగే, గొప్ప కాలింగ్ సౌకర్యాన్ని అందించడానికి వీలుగా కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కలిగిన 6 mic సిస్టం ను కూడా ఈ బడ్స్ లో అందించింది.

రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ప్రో ఇయర్ బడ్స్ టోటల్ 40 గంటల ప్లే టైం అందిస్తుంది. బడ్స్ ప్లే టైం విషయానికి వస్తే, ఈ బడ్స్ 10 గంటల ప్లే టైం అందిస్తాయి. అయితే, ANC On లో 7.5 గంటల ప్లే టైం మాత్రమే అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo