pTron కేవలం రూ.999 రేటుకే సౌండ్ బార్ విడుదల చేసింది.!!
pTron లేటెస్ట్ సౌండ్ బార్ Musicbot Evo ని విడుదల చేసింది
1,000 రూపాయల కంటే తక్కువ ధరకే విడుదల చేయ్యడం విశేషం
ఈ సౌండ్ బార్ ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆడియో బ్రాండ్ pTron, లేటెస్ట్ సౌండ్ బార్ ఆడియో సిస్టమ్ 'Musicbot Evo'ని విడుదల చేసింది. ప్రస్తుతం OTT ప్లాట్‌ఫారమ్‌లు మరియు షోలకు పెరుగుతున్న ప్రజాదరణతో, హోమ్ థియేటర్ సౌండ్ సిస్టమ్ కోసం పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా ఈ సౌండ్ బార్ ను కేవలం 1,000 రూపాయల కంటే తక్కువ ధరకే విడుదల చేయ్యడం విశేషం. ఈ లేటెస్ట్ సౌండ్ సంగతులు ఏమిటో వివరంగా తెలుసుకుందాం పదండి.
SurveypTron Musicbot Evo సౌండ్ బార్ సొగసైన డిజైన్‌తో మరియు లేటెస్ట్ టెక్నాలజీతో మేళవింపుగా వస్తుంది. ఈ సౌండ్ బార్ ఇన్ బిల్ట్ బ్యాటరీతో వస్తుంది మరియు 10 గంటల ప్లేబ్యాక్ ను అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDTVలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మొదలైన వాటికి సరిగ్గా సరిపోతుంది. Musicbot Evo సౌండ్ బార్ కేవలం 38.7cm పొడవు, 6.5 cm లోతు మరియు 6.5 cm ఎత్తుతో ఉంటుంది. ఇది మెటాలిక్ ఫ్రంట్ గ్రిల్స్ మరియు మృదువైన గుండ్రని అంచులతో స్థూపాకార డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 10W స్పీకర్లు మరియు 52mm డ్రైవర్స్ తో ఉంటుంది.
ఇక ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ వివరాల్లోకి వెళితే, ఈ సౌండ్ బార్ లో వున్నా బ్లూటూత్ 5.0 ద్వారా వైర్ తో పనిలేకుండా చాలా సులభంగా మీరు మీ TV, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌కి కనెక్ట్ చెయ్యవచ్చు. అంతేకాదు, మరింత సౌండ్ సౌండ్ ను పొందాలనుకుంటే, వైర్‌లెస్ స్టీరియో పెయిరింగ్ ఫంక్షన్ ద్వారా రెండు Musicbot Evo లను కూడా కనెక్ట్ చేయవచ్చు. అలాగే, మీరు 3.5mm AUX ఇన్‌పుట్, USB డ్రైవ్, TF కార్డ్ లేదా బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్ లను అందుకుంటారు.
pTron Musicbot Evo సౌండ్ బార్ కేవలం రూ.999 ధరతో వచ్చింది మరియు 23 ఆగస్ట్ 2022 నుండి Flipkart నుండి లభిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile