Oppo Enco Buds 3 Pro: ఒప్పో కొత్త బడ్స్ ప్రైస్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

K13 టర్బో సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో కొత్త బడ్స్ కూడా లాంచ్ చేసింది

Oppo Enco Buds 3 Pro ఎక్కువ సమయం ప్లే టైమ్ అందించే బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో వచ్చింది

ఈ బడ్స్ ప్రస్తుతం ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి

Oppo Enco Buds 3 Pro: ఒప్పో కొత్త బడ్స్ ప్రైస్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Oppo Enco Buds 3 Pro: ఒప్పో నిన్న విడుదల చేసిన K13 టర్బో సిరీస్ స్మార్ట్ ఫోన్ లతో ఈ కొత్త బడ్స్ కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ ను ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ ఎక్కువ సమయం ప్లే టైమ్ అందించే బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో వచ్చింది. ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్స్ ప్రైస్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo Enco Buds 3 Pro: ప్రైస్

ఒప్పో ఈ కొత్త ఎన్కో బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్ ని కేవలం రూ. 1,799 ధరతో లాంచ్ చేసింది. ఈ బడ్స్ అండర్ రూ. 2,000 ప్రైస్ సెగ్మెంట్ యూజర్లను టార్గెట్ చేసుకొని అందించబడిన బడ్స్. ఈ బడ్స్ ప్రస్తుతం ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్స్ ఆగస్టు 20వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

OPPO Enco Buds 3 Pro : ఫీచర్స్

ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో ఇయర్ బడ్స్ ని 12.4mm డైనమిక్ స్పీకర్ తో అందించింది. ఈ స్పీకర్లు 20~20KHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేట్ కలిగి ఉంటుంది. అంటే, గొప్ప బాస్ మరియు ట్రబుల్ సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ AAC/SBC కొడెక్ కలిగి మంచి లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. ఈ ఒప్పో కొత్త ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ సపోర్ట్ తో మంచి కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

Oppo Enco Buds 3 Pro

ఈ ఒప్పో కొత్త బడ్స్ ఎక్కువ సమయం నిల్చె బ్యాటరీ మరియు ఆ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ సెటప్ తో అందించింది. ఈ బడ్స్ టోటల్ 54 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఇందులో బడ్స్ సింగల్ ఛార్జ్ తో 12 గంటల ప్లే అందించే సత్తా కలిగి ఉంటాయని ఒప్పో తెలిపింది. ఈ బడ్స్ కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో 4 గంటల ప్లే టైమ్ అందిస్తాయని ఒప్పో ఈబడ్స్ గురించి గొప్పగా చెబుతోంది. ఇందులో హైపర్ డ్యూరబుల్ బ్యాటరీ ఉన్నట్లు ఒప్పో ప్రకటించింది.

Also Read: Vivo V60 5G: వి సిరీస్ నుండి కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ బడ్స్ కూడా ఎన్కో సిరీస్ లో ముందుగా వచ్చిన బడ్స్ మాదిరిగా కాంపాక్ట్ డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ జేబులో పెట్టుకోవడానికి వీలుగా మంచి డిజైన్ తో అందించింది. ఈ కొత్త బడ్స్ ను గ్లేజ్ వైట్ మరియు గ్రాఫైట్ గ్రే రెండు రంగుల్లో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo