OnePlus Nord Buds 4 sale starts from today know the price and features
ఆకట్టుకునే ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చిన OnePlus Nord Buds 4 సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఇయర్ బడ్స్ టైటానియం కోటెడ్ బిగ్ స్పీకర్ సెటప్,Hi-Res వైర్లెస్ ఆడియో సర్టిఫికేషన్ మరియు లాంగ్ ప్లే బ్యాక్ అందించలేం మంచి బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ ఈ వన్ ప్లస్ కొత్త ఇయర్ బడ్స్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ కొనడానికి ముందు ఇక్కడ అందించిన ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ వివరంగా చూడండి.
వన్ పుష్ నార్డ్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ కేవలం రూ. 3,299 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఈ ఇయర్ బడ్స్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులో వస్తాయి. ఈ బడ్స్ ను అమెజాన్ ఇండియా మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఫస్ట్ డే సందర్భంగా ఈ బడ్స్ పై రూ. 200 ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ని కూడా వన్ ప్లస్ అందించింది. ఈ బడ్స్ స్టెల్లార్ బ్లాక్ మరియు ఆస్ట్రల్ టీల్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
వన్ ప్లస్ సరికొత్తగా అందించిన ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ మంచి సౌండ్ అందించే 12.4mm సైజు కలిగిన పెద్ద టైటానియం కోటెడ్ డైనమిక్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇది డీప్ బాస్ అండ్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ Hi-Res వైర్లెస్ ఆడియో, బాస్ వేవ్ 2.0 టెక్నాలజీ మరియు వన్ ప్లస్ 3D ఆడియో సపోర్ట్ వంటి అదనపు ఫీచర్స్ తో మరింత మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది.
52dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఈ కొత్త బడ్స్ ను అందించింది. అంతేకాదు, ఈ కొత్త ఇయర్ బడ్స్ 5,500Hz వరకు అల్ట్రా వైడ్ నాయిస్ క్యాన్సిలేషన్ రేంజ్‌కూడా కలిగి ఉంటుంది.ఈ ఫీచర్ తో వెలుపలి శబ్దాలను గణనీయంగా తగ్గించి మంచి క్లీన్ సౌండ్ అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఇందులో బ్లూటూత్ 6.1 మరియు స్మార్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. ఇది డ్యూయల్ డివైజ్ కనెక్షన్ మరియు గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
Also Read: Goat Sale నుంచి iPhone బిగ్ డీల్స్ రివీల్ చేసిన ఫ్లిప్ కార్ట్ .. ఐఫోన్ ప్రియులకు పండగే.!
ఈ బడ్స్ గేమింగ్ కోసం లో లెటెన్సీ గేమింగ్ మోడ్ కలిగి ఉంది. ఇది IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ మరియు 45–54 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ అందించే బ్యాటరీ సెటప్ కలిగి ఉంది. రద్దీ ప్రాంతంలో కూడా మంచి క్వాలిటీ కాలింగ్ కోసం ఈ బడ్స్ AI ఆధారిత నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 6 మైక్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ వన్ ప్లస్ Hey Melody యాప్ సపోర్ట్ తో మరింత కస్టమైజ్ కు సపోర్ట్ చేస్తుంది.