OnePlus Nord Buds 4 launch date and features announced
OnePlus Nord Buds 4 ఇయర్ బడ్స్ లాంచ్ గురించి రెండు రోజుల క్రితం టీజర్ అందించిన వన్ ప్లస్ ఈ బడ్స్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను బిగ్ టైటానియం స్పీకర్లు మరియు లాంగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది. ఈ అప్ కమింగ్ బడ్స్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ ను జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారత్ లో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ డేట్ అండ్ టైం రివీల్ చేసింది. ఈ బడ్స్ లాంచ్ కోసం అమెజాన్ ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ పేజీ నుంచి ఈ డేట్ మరియు టైం వివరాలు రివీల్ చేసింది. ఇదే కాదు ఈ ఇయర్ బడ్స్ కీలక ఫీచర్స్ సైతం ఈ పేజీ నుంచి రివీల్ చేసింది.
వన్ ప్లస్ తన నార్డ్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ ను పెద్ద 12mm టైటానియం కోటెడ్ స్పీకర్ లతో లాంచ్ చేస్తోంది. ఈ స్పీకర్ సెటప్ తో ఇది డీప్ బాస్ మరియు క్రిస్పీ హై సౌండ్ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఈ బడ్స్ ఇదే సిరీస్ లో ముందుగా వచ్చిన వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో మాదిరిగా కాకుండా స్మూత్ అండ్ రౌండ్ కార్నర్ తో ఉంటుంది. ఇందులో అందించే బడ్స్ మంచి కంఫర్ట్ డిజైన్ మరియు కేవలం 4.3 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటాయి.
ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ స్పెషల్ ఫీచర్స్ కి వస్తే, ఈ బడ్స్ 52 dB రియల్ టైం యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఇది అనవసర శబ్దాన్ని పూర్తిగా తగ్గించి మంచి ఆడియో ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. అంతేకాదు, 6 మైక్ Ai క్లియర్ కాల్ ఫీచర్ తో మంచి కాలింగ్ కూడా ఆఫర్ చేస్తుంది.
Also Read: రియల్‌మీ లేటెస్ట్ బిగ్ బ్యాటరీ ఫోన్ Realme P4R 5G ఫస్ట్ సేల్.!
ఈ బడ్స్ ఎక్కువ సమయం నిలిచి ఉండే లాంగ్ బి బ్యాటరీతో వస్తుంది. ఈ బడ్స్ 54 గంటల అల్ట్రా లాంగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంటే, ఈ బడ్స్ ఎక్కువ కాలం మ్యూజిక్ ప్లే బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ ఆంప్లిఫైడ్ స్పేషియల్ సౌండ్ మరియు లో లెటెన్సీ ఫీచర్ తో కూడా లాంచ్ అవుతుంది.