OnePlus Nord Buds 4 india launch teaser released
OnePlus Nord Buds 4 ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. 2026 మార్చి నెలలో వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ప్రో ఇయర్ బడ్స్ రిలీజ్ చేసిన వన్ ప్లస్, ఇప్పుడు ఈ సిరీస్ లో బేసిక్ వేరియంట్ ఇయర్ బడ్స్ లాంచ్ కోసం వన్ ప్లస్ ఇప్పుడు సిద్దమయ్యింది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ వివరాలు ఏమిటో చూద్దమా.
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ఇండియా లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు వన్ ప్లస్ ప్రకటించింది. ఈ ఇయర్ బడ్స్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా వన్ ప్లస్ టీజింగ్ చేసింది. అంటే, ఈ ఇయర్ బడ్స్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 4 ఇయర్ బడ్స్ యొక్క డిజైన్ లేదా ఫీచర్స్ వంటి ఎలాంటి వివరాలు కూడా వన్ ప్లస్ ఇంకా అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ బడ్స్ లీక్స్ మరియు రూమర్స్ ఈ బడ్స్ గురించి కొన్ని వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల వన్ ప్లస్ అందించిన నార్డ్ బడ్స్ 4 ప్రో బేసిక్ వెర్షన్ గా ఇది వస్తుంది అని లీక్స్ చెబుతున్నాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీక్స్ సమాచారం ప్రకారం, ఈ బడ్స్ ఇన్ ఇయర్ డిజైన్‌తో సిలికాన్ ఇయర్ టిప్స్ తో వస్తుంది. ఇది స్టెమ్ స్టైల్ డిజైన్ ఇయర్ బడ్స్ మరియు టచ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ బడ్స్ ను కొత్త డిజైన్ ఛార్జింగ్ కేస్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని కూడా లీక్స్ చెబుతున్నాయి.
ఇక స్పీకర్ విషయానికి వస్తే, ఇందులో 10mm–12mm డైనమిక్ డ్రైవర్లు ఉండొచ్చని రూమర్ ఉంది. ఇందులో యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ మరియు Bluetooth 5.4 లేదా అంతకంటే అధిక వెర్షన్ కనెక్టివిటీ సపోర్ట్ ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఈ ఇయర్ బడ్స్ 35–45 గంటల బ్యాటరీ బ్యాకప్, IP55 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ మరియు డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read: ఈరోజు లభిస్తున్న బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv డీల్ పై ఒక లుక్కేద్దామా.!
ఈ అప్ కమింగ్ బడ్స్ గురించి లీక్స్ చెబుతున్న ఓవరాల్ వివరాలు చూస్తే, ఈ బడ్స్ ను బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ANC, బ్యాటరీ లైఫ్, మరియు సౌండ్ క్వాలిటీని అందించే ఇయర్ బడ్స్‌గా అందించే అవకాశం ఉంది. అయితే, వన్ ప్లస్ అధికారిక లాంచ్ తర్వాత పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుస్తాయి.