OnePlus Nord Buds 4 earbuds top 5 features know here
OnePlus Nord Buds 4 : వన్ ప్లస్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్లు కూడా వన్ ప్లస్ విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ఆకట్టుకునే కొత్త డిజైన్, పెద్ద స్పీకర్ మరియు పరిసర శబ్దాలను నిలువరించే ANC వంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ టాప్ 5 ఫీచర్స్ మరియు ప్రత్యేకతలు లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ను జేబులో ఈజీగా క్యారీ చేసే ఓవెల్ అండ్ సర్కిల్ మిడ్ డిజైన్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ కాంపాక్ట్ డిజైన్ లో ఉంటుంది మరియు ఈ సైజులో కూడా 54 గంటల ప్లే బ్యాక్ అందించే లాంగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
ఈ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ 12mm టైటానియం కోటెడ్ స్పీకర్ ఉంటుంది. ఈ సెటప్ కలిగిన స్పీకర్ లు డీప్ బాస్, క్లియర్ వోకల్స్ మరియు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందించే విధంగా ఉంటాయి. ఇవి గొప్ప సౌండ్ అందించే అవకాశం ఉంటుంది.
ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ 52dB వరకు రియల్ టైమ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ 5000Hz వరకు నాయిస్ క్యాన్సిలేషన్ రేంజ్‌తో చెవి వెలుపలి శబ్దాలను నిరోధించి క్లీన్ సౌండ్ అందిస్తుంది.
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ కాలింగ్ కోసం గొప్ప సెటప్ కలిగి ఉంది. ఈ ఇయర్ బడ్స్ 6 Mic సెటప్ మరియు నోయిస్ రిడక్షన్ ఫీచర్ తో వస్తుంది. అంటే, ఇందులో మొత్తం 6 మైక్రోఫోన్లు ఉన్నాయి మరియు ఇది ఏఐ ఆధారిత కాల్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ తో గాలి లేదా చుట్టూ ఉండే రణగొణ ధ్వని తగ్గించి స్పష్టమైన కాల్ సౌకర్యం అందిస్తుంది.
ఈ ఇయర్ బడ్స్ లో 3D Spatial Audio సపోర్ట్ ఉన్నట్లు వన్ ప్లస్ తెలిపింది. అంటే, ఇందులో మీకు మంచి ఆడియో అనుభూతి లభించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ బడ్స్ గేమింగ్ కోసం లో లేటెన్సీ మోడ్ కూడా కలిగి ఉంటుంది.
మొత్తంగా చూస్తే, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ ఇయర్ బడ్స్ నార్డ్ బడ్స్ 4 డీప్ బాస్ అండ్ క్లియర్ సౌండ్ స్పీకర్, లాంగ్ బ్యాటరీ లైఫ్, AI క్లారిటీ కాల్ ఫీచర్ మరియు గొప్ప ANC వంటి ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ బడ్స్ ప్రైస్ ను బట్టి ఇది ఎంత పెద్ద పోటీదారుడు అవుతుందో తెలుస్తుంది.
Also Read: ఇంటిగ్రేటెడ్ Dolby సౌండ్ బార్ Smart Tv పై భారీ ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!
వన్ ప్లస్ జూన్ 25వ తేదీన ఈ ఇయర్ బడ్స్ ను మార్కెట్ లో విడుదల చేస్తుంది. ఈ బడ్స్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ లాంచ్ డేట్ రోజు మళ్ళీ కలుద్దాం.