OnePlus Nord Buds 3r సేల్ రేపు స్టార్ట్ అవుతుంది: ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
వన్ ప్లస్ ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా విడుదల చేసిన OnePlus Nord Buds 3r ఇయర్ బడ్స్ ఫస్ట్ సెల్ రేపు మొదలవుతుంది. ఈ ఇయర్ బడ్స్ ను చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్లతో వన్ ప్లస్ విడుదల చేసింది. రేపటి నుంచి అందుబాటులోకి రాబోతున్న ఈ వన్ ప్లస్ ఇయర్ బర్డ్స్ యొక్క ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
SurveyOnePlus Nord Buds 3r ప్రైస్ ఏమిటి?
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3r ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,599 రూపాయల ధరలో విడుదల చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ అక్టోబర్ 8వ తేదీ అనగా రేపటి నుంచి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ అమెజాన్ ఇండియా మరియు వన్ ప్లస్ అధికారిక వెబ్సైట్ నుంచి లభిస్తాయి. ఈ వన్ ప్లస్ లేటెస్ట్ ఇయర్ బడ్స్ బ్లూ అండ్ బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తాయి.
OnePlus Nord Buds 3r : ఫీచర్స్
వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3r ఇయర్ బడ్స్ ను సరికొత్త డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ 54 గంటల ప్లే టైమ్ అందించే మంచి బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ సింగల్ ఛార్జ్ తో 12 గంటల ప్లే టైమ్ అందిస్తాయని వన్ ప్లస్ తెలిపింది. అంతేకాదు, కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో గంటల ప్లే బ్యాక్ అందిస్తుందని కూడా వన్ ప్లస్ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ మంచి ఫ్లెక్సిబుల్ డిజైన్ తో ఉంటుంది.

వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3r ఇయర్ బడ్స్ లో 12.4mm టైటానైజ్డ్ డైఫాగ్రామ్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ బడ్స్ బ్యాలెన్స్ డీప్ బాస్ మరియు క్రిస్టల్ క్లియర్ డిటైల్స్ సౌండ్ అందిస్తుందని కూడా వన్ ప్లస్ తెలిపింది. ఈ బడ్స్ వన్ ప్లస్ సౌండ్ మాస్టర్ EQ సపోర్ట్ తో వస్తుంది మరియు యూజర్ కు నచ్చినట్లు ఈక్వలైజర్ ను సెటప్ చేసుకునే అవకాశం అందిస్తుంది. ఇందులో వన్ ప్లస్ 3D ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది.
Also Read: బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్ తో ఒప్పో తెచ్చిన OPPO K13 Turbo 5G పై బిగ్ డీల్స్ మిస్సవ్వకండి.!
ఇక కనెక్టివిటీ మరియు ఇతర ఫీచర్లు విషయానికి వస్తే, ఈ బడ్స్ బ్లూటూత్ 5.4 కనెక్టివిటీ సపోర్ట్, 47 ms లో లెటెన్సీ మోడ్ మరియు డ్యూయల్ డివైజ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ గూగుల్ ఫాస్ట్ పెయిర్, వాయిస్ అసిస్టెంట్ IP55 రేటింగ్, ఆక్వా టచ్ మరియు ఫైండ్ మై ఇయర్ బడ్స్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.