4K Audio తో మోటోరోలా AmphisoundX సిరీస్ నుండి కొత్త సౌండ్ బార్స్
మోటరోలా యొక్క AmphisoundX సిరీస్ సౌండ్‌బార్స్ మరియు హోమ్ థియేటర్స్ ను మరింతగా విస్తరించనున్నవిషయాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
సబ్ వూఫర్ మరియు 100W సౌండ్ బార్ తో పూర్తిగా వైర్ లెస్ 200W 5.1 సౌండ్ బార్ ను విడుదల చేయడం గురించి ఇందులో చూపించింది.
AmphisoundX రేంజ్ సౌండ్ బార్స్ అద్భుతమైన ఫీచర్లతో కూడి ఉంటుంది, ఇది పవర్ ఫుల్ సౌండ్ మరియు పనితీరును అందిస్తుంది.
మోటరోలా యొక్క AmphisoundX సిరీస్ సౌండ్‌బార్స్ మరియు హోమ్ థియేటర్స్ ను మరింతగా విస్తరించనున్నవిషయాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. సబ్ వూఫర్ మరియు 100W సౌండ్ బార్ తో పూర్తిగా వైర్ లెస్ 200W 5.1 సౌండ్ బార్ ను విడుదల చేయడం గురించి ఇందులో చూపించింది. ఈ రెండు వేరియంట్ లలో 200W వేరియంట్ ట్రూ వైర్ లెస్ 14,999 రూపాయలు మరియు 100W మోడల్ మాత్రం 7,499 రూపాయల ధరతో ప్రకటించింది మరియు సెప్టెంబర్ 14 నుండి ఇవి లభిస్తాయి.
Surveyమోటరోలాతో దాని వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా భారతదేశ స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్ అయిన ఫ్లిప్ కార్ట్, మోటరోలా యొక్క AmphisoundX రేంజ్ సౌండ్ బార్లు మరియు హోమ్ థియేటర్లను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. మోటరోలా యాంఫిసౌండ్ ఎక్స్ సౌండ్‌బార్స్ యొక్క రెండు కొత్త వేరియంట్ లను విడుదల చేయడంతో – సబ్ వూఫర్ & సరౌండ్ సౌండ్ స్పీకర్లతో ఫుల్లీ వైర్ లెస్ 200 డబ్ల్యూ 5.1 సౌండ్ బార్, మరియు 100W సౌండ్ బార్, వినియోగదారులకు నిజంగా లీనమయ్యే మరియు ‘అదనపు శక్తివంతమైన’ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. AmphisoundX రేంజ్ సౌండ్ బార్స్ అద్భుతమైన ఫీచర్లతో కూడి ఉంటుంది, ఇది పవర్ ఫుల్ సౌండ్ మరియు పనితీరును అందిస్తుంది.
AmphisoundX 200 W soundbar
మోటరోలా యాంఫి సౌండ్ ఎక్స్ 200 W సౌండ్ బార్ గ్లాస్ టాప్ టచ్ ప్యానెల్, వైర్ లెస్ సబ్ వూఫర్ మరియు వైర్ లెస్ సరౌండ్-సౌండ్ స్పీకర్లతో సహా అల్ట్రా-ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. ఇది 6 x 2.75 "ఫ్రంట్-ఫైరింగ్ డ్రైవర్లతో 72 W సౌండ్ బార్, అంటే 2.75 అంగులా పరిమాణం గల 6 స్పీకర్లు గల సౌండ్ బార్, అంతర్నిర్మిత డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (DSP) మరియు యాంప్లి ఫైయర్, 24W సరౌండ్ లెఫ్ట్ & రైట్ వైర్ లెస్ శాటి లైట్ 3" స్పీకర్లతో, వక్రీకరణ లేని ధ్వని కోసం ఆప్టిమైజ్ చేసిన ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మరియు 8 " BASS డ్రైవర్ తో అత్యంత శక్తివంతమైన డౌన్-ఫైరింగ్ 80 W సబ్ వూఫర్ – అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. ఈ సౌండ్ బార్, HDMI ARC మరియు 4K ఆడియో మరియు 5.1 ఛానెల్ కోసం ఆప్టికల్ కనెక్టివిటీతో, మీ ఇంటిలోనే నిజమైన సినిమా హల్ వంటి అనుభవాన్ని సృష్టించగలుగుతుంది. రిమోట్ లోని హాట్‌కీలను ఉపయోగించి వినియోగదారులు తమకు కావలసిన సౌండ్ ఎఫెక్ట్ లను ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది.
AmphisoundX 100 W soundbar
మోటరోలా యాంఫి సౌండ్ ఎక్స్ 100 W సౌండ్ బార్ ఒక అల్ట్రా-పోర్టబుల్ సౌండ్ బార్, ఇది 50 W సౌండ్ బార్ లో 2.25 "ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్స్ ను కలిగి ఉంది. ఇది అంతర్నిర్మిత డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (DSP) మరియు యాంప్లి ఫైయర్ (AMP) మరియు 50 W సబ్ వూఫర్ 6.5 "బాస్ వూఫర్ తో , ఇది గొప్ప ఆడియో నాణ్యతను అందిస్తుంది. ఈ సొగసైన మరియు ఆధునిక 60 సెం.మీ సౌండ్ బార్ HDMI ARC మరియు ఆప్టికల్ కనెక్టివిటీతో వస్తుంది మరియు బ్లూటూత్ 5.0, ఆల్ రౌండ్ కనెక్టివిటీ కోసం AUX మరియు USB పోర్ట్‌లను కూడా కలిగివుంది.
మోటరోలాతో తన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్, వినూత్న మరియు కస్టమర్-ఫస్ట్ ఉత్పత్తులను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తోంది. ఇటీవల, ఫ్లిప్ కార్ట్ 160 W సౌండ్‌బార్, 150 W హోమ్ థియేటర్, 80 W హోమ్ థియేటర్, 120 W సౌండ్‌బార్, 120 W హోమ్ థియేటర్ మరియు 70 W సౌండ్‌బార్‌తో సహా మోటరోలా ఆడియో పరికరాలను ప్రవేశపెట్టింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile