Moto Buds 2 బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

మోటో జి 37 పాటు Moto Buds 2 ఇయర్ బడ్స్ కూడా విడుదల చేసింది

ఈ ఇయర్ బడ్స్ ను బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది

మోటోరోలా ఈ కొత్త ఇయర్ బడ్స్ ను డ్యూయల్ డ్రైవర్ సెటప్ తో అందించింది

మోటో జి 37 స్మార్ట్ ఫోన్ సిరీస్ తో పాటు ఈరోజు Moto Buds 2 ఇయర్ బడ్స్ ను కూడా ఇండియాలో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ ను బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది. మోటోరోలా సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ వివరంగా తెలుసుకుందాం.

Moto Buds 2 : ప్రైస్

మోటోరోలా ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 2,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ పై రూ. 200 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఇయర్ బడ్స్ పాంటోన్ వయొలెట్ ఐస్, పాంటోన్ కార్బన్ మరియు పాంటోన్ గ్రే మిస్ట్ మూడు రంగుల్లో లభిస్తుంది. మీ 25వ తేదీ నుంచి ఈ ఇయర్ బడ్స్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ బడ్స్ ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.

Moto Buds 2 : ఫీచర్స్

మోటోరోలా ఈ కొత్త ఇయర్ బడ్స్ ను డ్యూయల్ డ్రైవర్ సెటప్ తో అందించింది. ఇందులో 11mm డైనమిక్ డ్రైవర్ మరియు 6mm మైక్రో ప్లానర్ మాగ్నెటిక్ డ్రైవర్ ఉంటాయి. ఈ కొత్త బడ్స్ ను Hi-Res Audio సపోర్ట్ మరియు LDAC హై క్వాలిటీ ఆడియో కోడెక్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫీచర్స్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ ను ఈ ఇయర్ బడ్స్ ఆఫర్ చేస్తుందని మోటోరోలా తెలిపింది. అంతేకాదు, ఇందులో 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో ఫీచర్ కూడా ఉంది.

కాలింగ్ కోసం ఈ ఇయర్ బడ్స్ లో 6 మైక్ సిస్టం కూడా అందించింది. మోటోరోలా ఈ ఇయర్ బడ్స్ ను 55dB అడాప్టివ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ తో అందించింది. ఇది ఎటువంటి అవాంఛిత సౌండ్ ను చెవుల దరి చేరనివ్వకుండా చేస్తుంది. కాబట్టి, లీనమయ్యే మ్యూజిక్ మీ సొంతం అవుతుంది. ఈ బడ్స్ మోటో AI సపోర్ట్ ను కూడా కలిగి ఉంటాయి.

Also Read: బడ్జెట్ ధరలో Moto G37 మరియు G37 Power లాంచ్ చేసిన మోటోరోలా.!

బ్యాటరీ పరంగా, ఈ మోటోరోలా కొత్త ఇయర్ బడ్స్ టోటల్ 53 గంటల ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ మోటో బడ్స్ 2 కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 6.0 సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ మోటో బడ్స్ మ్యూజిక్ యాప్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. మోటో బడ్స్ 2 ఇయర్ బడ్స్ ను IP54 రేటింగ్ వాటర్ రెపెళ్లేంట్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ మోటో బడ్ డ్యూయల్ డివైజ్ కనెక్షన్ ఫీచర్ తో పాటు ఆడియో షేర్ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :