JBL New Live 780 NC sale with big deals starts from prime day sale
JBL New Live 780 NC : ప్రముఖ ఆడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ జేబీఎల్ లేటెస్ట్ గా గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేసిన కొత్త హెడ్ ఫోన్ ఎట్టకేలకు ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. న్యూ లైవ్ 780 NC పేరుతో విడుదల చేసిన ఈ ప్రీమియం హెడ్ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ హెడ్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే 2026 నుంచి సేల్ అవుతుంది.
జేబీఎల్ ఈ లేటెస్ట్ హెడ్ ఫోన్ ను రూ. 15,999 ప్రైస్ ట్యాగ్ తో భారత్ లో లాంచ్ చేసింది. అయితే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ హెడ్ ఫోన్ పై భారీ తగ్గింపు ఆఫర్స్ అందించింది. ఈ హెడ్ ఫోన్ పై రూ. 2,000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ జత చేసింది. అంతేకాదు, ఈ హెడ్ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
ఈ హెడ్ ఫోన్ ను SBI, ICICI మరియు Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ తో ఈ హెడ్ ఫోన్ ను కొనే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ కొత్త హెడ్ ఫోన్ కేవలం రూ. 12,999 ఆఫర్ ధరలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి లభిస్తుంది. ఈ హెడ్ ఫోన్ ను ప్రస్తుతం రూ. 1,500 రూపాయలు చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఈ హెడ్ ఫోన్ జూలై 3వ తేదీ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ పైన అందించిన అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కేవలం 3వ తేదీ ఈ హెడ్ ఫోన్ ను కొనే వారికి మాత్రమే లభిస్తుంది.
Also Read: Flipkart బ్యాక్ టు క్యాంపస్ సేల్ నుంచి Google Pixel 10 ఫోన్ పై రూ.12,000 డిస్కౌంట్ ప్రకటించింది.!
జేబీఎల్ సరికొత్తగా ప్రవేశపెట్టిన జేబీఎల్ లైవ్ 780 NC వైర్ లెస్ ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్ ప్రీమియం ఆడియో అనుభవాన్ని అందించే ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో 40mm డైనమిక్ స్పీకర్లు, జేబీఎల్ సిగ్నేచర్ సౌండ్, LDAC Hi-Res Audio సపోర్ట్ మరియు జేబీఎల్ స్పేషియల్ సౌండ్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ఈ హెడ్ ఫోన్ సినిమాలు మరియు గేమింగ్ సమయంలో గొప్ప ఇమర్సివ్ ఆడియో అనుభవం అందిస్తుంది.
ఈ హెడ్ ఫోన్ లో బ్లూటూత్ 6.0, LE ఆడియో, ఆరా క్యాస్ట్ సపోర్ట్ మరియు మల్టీ పాయింట్ కనెక్టివిటీ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, ఈ హెడ్ ఫోన్ కలిగిన Personi-Fi 3.0 ద్వారా యూజర్లు తమ వినికిడి అలవాట్లకు అనుగుణంగా ఆడియో ప్రొఫైల్ ను వ్యక్తిగతీకరించుకోవచ్చు.
True Adaptive Noise Cancelling 2.0 టెక్నాలజీ ఫీచర్ ఈ హెడ్ ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ హెడ్ ఫోన్ కలిగిన ఆరు మైక్రోఫోన్ సహాయంతో పరిసర శబ్దాలను రియల్ టైమ్ లో విశ్లేషించి సమర్థవంతంగా తగ్గిస్తుంది. AI ఆధారిత Perfect Calls 2.0 ఫీచర్ వల్ల కాల్స్ సమయంలో స్పష్టమైన వాయిస్ క్వాలిటీ లభిస్తుంది. అంటే, ఈ హెడ్ ఫోన్ కాలింగ్ కోసం పర్ఫెక్ట్ గా ఉంటుంది.
బ్యాటరీ విషయానికి వస్తే, ఈ హెడ్ ఫోన్ ANC ఆఫ్ తో గరిష్టంగా 80 గంటలు, ANC ఆన్ లో 50 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుంది. కేవలం 5 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్ తో 4 గంటల ప్లే బ్యాక్ వినియోగం పొందవచ్చు. డిజైన్ పరంగా ఇది ఫోల్డబుల్ డిజైన్ తో వస్తుంది మరియు కేవలం 260 గ్రాముల బరువు ఉంటుంది. ఇది JBL హెడ్ ఫోన్ యాప్ సపోర్ట్, Ambient Aware, Talk Thru మరియు Voice Aware వంటి ఫీచర్లతో ప్రీమియం హెడ్ ఫోన్ సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా ఉంటుంది.