JBL Tune Series నుంచి మూడు కొత్త బడ్స్ లాంచ్: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

JBL Tunes Series నుంచి మూడు కొత్త బడ్స్ లాంచ్ చేసింది

ట్యూన్ బీమ్ 2, ట్యూన్ బడ్స్ 2 మరియు ట్యూన్ ఫ్లెక్స్ 2 మూడు బడ్స్ లాంచ్ చేసింది

ఈ మూడు బడ్స్ కూడా ANC మరియు జెబిఎల్ సిగ్నేచర్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యాయి

JBL Tune Series నుంచి మూడు కొత్త బడ్స్ లాంచ్: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

JBL Tune Series నుంచి మూడు కొత్త బడ్స్ లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుంచి ట్యూన్ బీమ్ 2, ట్యూన్ బడ్స్ 2 మరియు ట్యూన్ ఫ్లెక్స్ 2 మూడు బడ్స్ లాంచ్ చేసింది. ఈ మూడు బడ్స్ కూడా ANC మరియు జెబిఎల్ సిగ్నేచర్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యాయి. ఈ కొత్త జెబిఎల్ బడ్స్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JBL Tune Series : ప్రైస్

జెబిఎల్ ట్యూన్ సిరీస్ నుంచి అందించి మూడు బడ్స్ ప్రైస్ లిస్ట్ ఈ క్రింద చూడవచ్చు.

జెబిఎల్ బడ్స్ 2 ధర : రూ . 5,099

జెబిఎల్ బీమ్ 2 ధర : రూ . 5,499

జెబిఎల్ ఫ్లెక్స్ 2 ధర : రూ. 5,499

మూడు బడ్స్ కూడా సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చాయి. ఈ బడ్స్ అమెజాన్ ఇండియా మరియు జెబిఎల్ అధికారిక సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి.

JBL Tune Series : ఫీచర్స్

జెబిఎల్ ట్యూన్ సిరీస్ నుంచి అందించిన ఈ మూడు బడ్స్ కూడా జెబిఎల్ సిగ్నేచర్ సౌండ్ అందిస్తాయి. ఈ మూడు బడ్స్ కూడా యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ బడ్స్ యాంబియంట్ అవేర్ మరియు రిలాక్స్ మోడ్ కలిగి ఉంటాయి. ఈ మూడు బడ్స్ జెబిఎల్ ప్యూర్ BASS మరియు స్పెటియల్ సౌండ్ అందిస్తుంది.

JBL Tunes Series

ట్యూన్ బీమ్ 2, ట్యూన్ బడ్స్ 2 మరియు ట్యూన్ ఫ్లెక్స్ 2 మూడు బడ్స్ కూడా JBL Headphones App సపోర్ట్ తో వస్తాయి మరియు యూజర్ కి కావలసిన విధంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం అందిస్తాయి. అంతేకాదు, ఈ మూడు బడ్స్ కూడా క్లియర్ కాలింగ్ కోసం 6 Mics సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ మూడు JBL కొత్త బడ్స్ కూడా టోటల్ 48 గంటల టైమ్ ప్లే అందించే బ్యాటరీ కలిగి ఉంటాయి.

Also Read: CMF Phone 2 Pro 5G ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిన నథింగ్.!

ఈ జెబిఎల్ ట్యూన్ సిరీస్ కొత్త బడ్స్ మల్టీ పాయింట్ కనెక్షన్ మరియు గూగుల్ ఫాస్ట్ పెయిర్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి. ఈ మూడు బడ్స్ కూడా IP 54 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటాయి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile