బిగ్ డిస్కౌంట్ తో రూ. 4,950 ధరలో 350W 5.1 ఛానల్ Soundbar అందుకోండి.!

HIGHLIGHTS

రూ. 4,999 ధరలో 350W 5.1 ఛానల్ Soundbar డీల్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది

చవక ధరలో ఇంటిని షేక్ చేసే లేటెస్ట్ సౌండ్ బార్

ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది

బిగ్ డిస్కౌంట్ తో రూ. 4,950 ధరలో 350W 5.1 ఛానల్ Soundbar అందుకోండి.!

బిగ్ డిస్కౌంట్ తో రూ. 4,999 ధరలో 350W 5.1 ఛానల్ Soundbar డీల్ ఒకటి ఈరోజు అందుబాటులో ఉంది. చవక ధరలో ఇంటిని షేక్ చేసే లేటెస్ట్ సౌండ్ బార్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈరోజు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దామా.

350W 5.1 Soundbar : డీల్

మివి ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ 5.1 సౌండ్ బార్ Mivi Fort H350 ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 84% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 5,499 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 549 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,950 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.

Mivi Fort H350 Soundbar : ఫీచర్లు

ఈ మివి సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్ , డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 350W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ గొప్ప ఐకానిక్ డిజైన్ మరియు రిమోట్ కంట్రోల్ తో వస్తుంది.

Mivi Fort H350 Soundbar

ఈ మివి సౌండ్ బార్ స్మార్ట్ టీవీ కోసం HDMI Arc మరియు ఆప్టికల్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. అలాగే, స్మార్ట్ ఫోన్ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.1, మొబైల్ మరియు ఆడియో డివైజెస్ కోసం AUX సపోర్ట్ మరియు పెన్ డ్రైవ్ తో డైరెక్ట్ ప్లే కోసం USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మ్యూజిక్, స్పోర్ట్స్, న్యూస్ మరియు మూవీ వంటి సౌండ్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Oppo K13x 5G: విడుదలకు ముందే కంప్లీట్ ఫీచర్లు మరియు ప్రైస్ తెలుసుకోండి.!

ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది. అయితే, మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ సౌండ్ బార్ లో DTS లేదా Dolby వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లేదు. అయితే, ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo