Flipkart Sale: లాస్ట్ డే లేటెస్ట్ 5.1 Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Freedom Sale నుంచి ఈరోజు భారీ సౌండ్ బార్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది
ఈ నెల ప్రారంభంలో స్టార్ట్ అయిన ఈ సేల్ రేపటితో ముగుస్తుంది
ఈరోజు లేటెస్ట్ 5.1 Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ అందించింది
Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ బిగ్ సేల్, Freedom Sale నుంచి ఈరోజు భారీ సౌండ్ బార్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ఈ నెల ప్రారంభంలో స్టార్ట్ అయిన ఈ సేల్ రేపటితో ముగుస్తుంది. అందుకే, కాబోలు ఈరోజు ఒకటికి మించిన ఆఫర్ మరొకటి అందిస్తోంది. ఇదే దారిలో ఈరోజు లేటెస్ట్ 5.1 Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ అందించింది. కొత్త సౌండ్ బార్ కోసం చూస్తున్న వారికి మంచి ఆఫర్ కాబట్టి ఈరోజు ఈ డీల్ మీకోసం అందిస్తున్నాం.
SurveyFlipkart Sale 5.1 Dolby Soundbar : డీల్
మంచి ఆడియో ప్రోడక్ట్స్ అందిస్తున్న బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న Boult, గత సంవత్సరం చివరిలో విడుదల చేసిన Bassbox X500 పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రూ. 13,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఇటీవల కూడా ఈ సౌండ్ బార్ రూ. 12,999 ధర తో సేల్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 3,000 డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 10,999 ప్రైస్ ట్యాగ్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లిస్ట్ అయ్యింది.

అంతేకాదు, ఈ సౌండ్ బార్ పై రూ. 1,099 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. BOBCARD మరియు ICICI క్రెడిట్ కార్డ్స్ తో ఈ సౌండ్ బార్ తీసుకునే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 9,900 ఆఫర్ ధరకే లభిస్తుంది.
Boult 5.1 Dolby Soundbar : ఫీచర్లు
బోల్ట్ పేరు ఇప్పుడు గో బోల్ట్ గా మారింది మరియు కొత్త లోగో తో కొత్త ప్రొడక్ట్స్ అందిస్తోంది. ఇక ఈ సౌండ్ బార్ విషయానికి వస్తే, ఇది చాలా ఆకర్షణీయమైన కొత్త డిజైన్ తో మార్కెట్ లాంచ్ అయ్యింది మరియు ఇంటికి తగిన ప్రీమియం డెకరేషన్ గా కూడా కనిపిస్తుంది. ఇది 5.1 ఛానల్ సెటప్ కలిగి టోటల్ 500W హెవీ సౌండ్ అందించే సత్తా కలిగి ఉంటుంది. ఇందులో మూడు ఫుల్ రేంజ్, రెండు శాటిలైట్ ఫుల్ రేంజ్ స్పీకర్లు మరియు హార్డ్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి.
ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఇందులో మరింత గొప్ప సౌండ్ కోసం డెడికేటెడ్ DSP చిప్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
Also Read: EPFO New Update: ఇకపై UAN జనరేషన్‌కు ఫేస్ అథెంటికేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం.!
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ కూడా అందుకుంది. ఇది 10 వేల రూపాయల బడ్జెట్ లో లభించే ప్రీమియం క్వాలిటీ అండ్ డిజైన్ సౌండ్ బార్ లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు.