LG Dolby Atmos సౌండ్ బార్ పై ధమాకా ఆఫర్ ప్రకటించిన Flipkart Sale.!
LG Dolby Atmos ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది
Flipkart Big Diwali Sale నుంచి ఈ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది
ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి LG S75Q 3.1.2 ఛానల్ సౌండ్ బార్ పై ఈ డీల్ అందించింది
LG Dolby Atmos ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. 2024 దీపావళి పండుగ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ‘Big Diwali Sale’ నుంచి ఈ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ దెబ్బకు చాలా తక్కువ ధరకే LG భారీ ఫీచర్స్ తో అందించిన పవర్ ఫుల్ సౌండ్ బార్ మిడ్ రేంజ్ ధరలో అందుకునే అవకాశం లభించింది. ఈ సౌండ్ బార్ గతంలో 60 వేల రూపాయల ప్రీమియం సెగ్మెంట్ లో మాత్రమే లభించింది.
SurveyFlipkart Sale LG Dolby Atmos : ఆఫర్
ఫ్లిప్ కార్ట్ రోజు నుంచి ప్రకటించిన బిగ్ దివాళీ సేల్ నుంచి ఈ LG సౌండ్ అబ్రా ఆఫర్ ను అనౌన్స్ చేసింది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి LG S75Q 3.1.2 ఛానల్ సౌండ్ బార్ పై ఈ డీల్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.

ఈ సౌండ్ బార్ ను మరింత తక్కువ ధరకి అందుకోవడానికి వీలుగా బ్యాంక్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 మరియు SBI క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read : Shocking News: కోటి మందికి పైగా Jio సబ్ స్క్రైబర్స్ అవుట్.. ఎందుకంటే.!
LG Dolby Atmos : ఫీచర్స్
ఈ LG సౌండ్ బార్ గొప్ప ఫీచర్స్ తో మరియు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన 3.1.2 ఛానల్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 380 W సౌండ్ అందిస్తుంది మరియు Meridian టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos మరియు dts:X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ లో రెండు 35W అప్ ఫైరింగ్ స్పీకర్లు, మూడు 30W ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు 220W పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ అన్ని Dolby ఫార్మాట్, అన్ని dts ఫార్మట్, Hi-Res Audio సపోర్ట్ మరియు FLAC సపోర్ట్ కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇంత తక్కువ ధరకు లభించడం ఇదే మొదటిసారి అవుతుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile