flipkart offers huge 5.1 soundbar deal before Flipkart Freedom Sale
Flipkart Freedom Sale కంటే ముందే బిగ్ డీల్ రిలీజ్ చేయడం ప్రారంభించింది. 2026 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ సేల్ ఆగస్టు 8 వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ సేల్ కి ఇంకా 10 రోజులు సమయం ఉండగా, ఫ్లిప్ కార్ట్ మాత్రం ఇప్పటి నుంచే భారీ డీల్స్ ప్రకటించడం మొదలుపెట్టింది. ఈరోజు అందించిన 4 వేలకే 5.1 సౌండ్ బార్ ఆఫర్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది.
ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ బిగ్ 5.1 సౌండ్ బార్ డీల్ ను అందించింది. అదేమిటంటే, 2024 సంవత్సరంలో రూ. 5,999 రూపాయల ధరతో GOVO లాంచ్ చేసిన, 5.1 సౌండ్ బార్ ను ఈరోజు రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. ఈ ధరలో సాధారణ సౌండ్ బార్ మాత్రమే లభించే ఈ రోజుల్లో, ఫ్లిప్ కార్ట్ మాత్రం ఈ అతి చవక ధరకే 5.1 ఛానల్ సౌండ్ బార్ ఆఫర్ చేస్తోంది.
అయితే, మేము ఈ ఆఫర్ గురించి న్యూస్ అందించే సమయానికి కేవలం రెండు సౌండ్ బార్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ముందుగా తీసుకుంటారో వారికి మాత్రమే ఈ సౌండ్ బార్ అందుకునే అవకాశం ఉంటుంది.
Also Read : Flipkart Sale మరియు Amazon Sale నాటికి లాంచ్ కాబోతున్న అప్ కమింగ్ ఫోన్స్.!
ఇది గోవో బ్రాండ్ నుంచి వచ్చిన 5.1 సౌండ్ బార్ మరియు ఇది టోటల్ 120W సౌండ్ అవుట్ ఫుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కాంపాక్ట్ అండ్ ప్రీమియం లుక్ కలిగిన డిజైన్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది మొత్తం 5 ఎక్స్‌ప్లోసివ్ స్పీకర్లు కలిగి ఉంటుంది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఇందులో ప్రత్యేకమైన సౌండ్ టెక్ లేదు. కానీ, ఈ సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ (DSP) తో మంచి సౌండ్ అంధిస్తుంది. ఇందులో HDMI Arc, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు AUX వంటి కంప్లీట్ కనెక్టవిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ కంప్లీట్ కీలు కలిగిన రిమోట్ మరియు ఫిజికల్ బటన్స్ కూడా కలిగి ఉంటుంది. ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి మంచి రేటింగ్ మరియు రివ్యూలు కూడా అందుకుంది.