ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి Dolby Atmos సౌండ్ బార్స్ పైన బిగ్ డీల్స్..!!
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి సౌండ్ బార్స్ మంచి అఫర్ ధరలకే లభిస్తున్నాయి
Zebronics బ్రాండ్ నుండి వచ్చిన సౌండ్ బార్స్ కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి
డాల్బీ అట్మోస్ సపోర్టెడ్ సౌండ్ బార్ ను అఫర్ ధరకే సొంతం చేసుకోవచ్చు
రేపటితో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి సౌండ్ బార్స్ మంచి అఫర్ ధరలకే లభిస్తున్నాయి. అందులోనూ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో Zebronics బ్రాండ్ నుండి వచ్చిన సౌండ్ బార్స్ కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంటే, ఈ సేల్ నుండి డాల్బీ అట్మోస్ సపోర్టెడ్ సౌండ్ బార్ ను అఫర్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అధనంగా, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది.
SurveyZeb-Juke Bar 9700 Pro: అఫర్&ఫీచర్స్
Zebronics యొక్క Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్ ఈ సేల్ నుండి కేవలం రూ.14,440 రూపాయలకే లభిస్తోంది. Buy From Here
ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్‌లో 6.5 ఇంచ్ సబ్ వూఫర్ స్పీకర్ మరియు క్వాడ్ 2.24 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. ఇది సౌండ్‌బార్‌తో పాటు సబ్ వూఫర్ యూనిట్‌తో కూడా వస్తుంది. ఈ సౌండ్‌బార్ 450W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు 45Hz నుండి 20,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ పరిధిని కలిగి ఉంది.
Dolby Atmos తో మీ సంగీత మరియు సినిమా వినోదాన్ని మరింత పెంచుకోవచ్చు. అంతేకాదు, Dolby Atmos యొక్క లీనమయ్యే సౌండ్ తో మీరు చూస్తున్న కంటెంట్ ని మరింత అందించవచ్చు. Dolby Atmos తో మీ వినోదాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడం గతంలో కంటే చాలా సులభం. Zeb-Juke Bar 9700 Pro Dolby Atmos సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.
Zeb-Juke Bar 9800DWS Pro: అఫర్&ఫీచర్స్
జీబ్రానిక్స్ యొక్క మరొక డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Zeb-Juke Bar 9800DWS Pro ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి రూ .19,949 ధరకే లభిస్తోంది. Buy From Here
మల్టీ ఛానల్ సరౌండ్ సెట్టింగ్ కోసం వైర్లతో కూడిన స్పీకర్లతో చిక్కుబడ్డ గజిబిజిని తప్పించుకోవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్‌బార్ సరళమైన డిజైన్‌లో సూపర్ సౌండ్ అందించేలా రూపొందించబడింది. ఇది ఎటువంటి వైర్ అవసరం లేకుండా, లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది మరియు చాలా సులభమైన సెటప్ తో వస్తుంది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, సౌండ్‌బార్‌లో ఇబ్బంది లేని సెటప్ మాత్రమే కాదు, మల్టి-కనెక్టివిటీ ఎంపికలతో కనెక్ట్ అవ్వడానికి చాలా సులభమైన మార్గం అందించింది. USB / AUX ఉపయోగించి మీ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ప్రసారం చెయ్యవచ్చు. మీరు HDMI (ARC) లేదా ఆప్టికల్ ఇన్‌పుట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు మరియు ఇబ్బంది లేకుండా కనెక్ట్ చేయవచ్చు. సౌండ్ బార్ ఒక HDMI అవుట్‌పుట్‌తో పాటు డ్యూయల్ HDMI ఇన్‌పుట్‌తో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile