ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి కేవలం 6 వేల ధరకే Sony Dolby సౌండ్ బార్ అందుకోండి.!

HIGHLIGHTS

కేవలం 6 వేల ధరకే Sony Dolby సౌండ్ బార్ అందుకోండి

ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి ఎన్నడూ లేనంత చవక ధరలో లభిస్తుంది

సోనీ బ్రాండ్ యొక్క ప్రీమియం సౌండ్ బార్ ను మీ బడ్జెట్ ధరలో అందుకోవచ్చు

ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి కేవలం 6 వేల ధరకే Sony Dolby సౌండ్ బార్ అందుకోండి. గొప్ప ప్రీమియం డిజైన్ మరియు సూపర్ స్పీకర్ సెటప్ తో ఈ సౌండ్ ను సోనీ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో 15 వేల రూపాయల కంటే అధిక ధరలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రోజు ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి ఎన్నడూ లేనంత చవక ధరలో లభిస్తుంది. సోనీ బ్రాండ్ యొక్క ప్రీమియం సౌండ్ బార్ ను మీ బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.

Sony Dolby సౌండ్ బార్ : GOAT Sale ఆఫర్

సోనీ ఇటీవల విడుదల చేసిన 2.0 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ HT-S100F పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. సోనీ ఈ సౌండ్ బార్ రూ. 14,990 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై 47% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 7,990 రూపాయల ఆఫర్ ధరలో గోట్ సేల్ నుంచి సేల్ చేస్తోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రం కాదు ఈ సౌండ్ బార్ పై రూ. 1,249 రూపాయల ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ రూపాయల ఈ సోనీ సౌండ్ బార్ కేవలం రూ. 6,741 అతి చవక ధరలో లభిస్తుంది.

Also Read: Moto G77 Power : లాంచ్ కంటే ముందే టాప్ 5 ఫీచర్స్ తెలుసుకుందామా.!

Sony Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

సోనీ HT-S100F సౌండ్ బార్ 2.0 ఛానల్ కాన్ఫిగరేషన్‌ తో సోనీ రూపొందించిన స్టైలిష్ మరియు కాంపాక్ట్ సౌండ్‌ బార్. ఈ సౌండ్ బార్ మొత్తం 120 వాట్ల సౌండ్ అవుట్‌ పుట్ అందిస్తుంది. ఈ మోడల్‌ లో S-Force Front Surround టెక్నాలజీ ఉండటంతో ప్రత్యేక వెనుక స్పీకర్ సెటప్ లేకుండానే గొప్ప సరౌండ్ సౌండ్ అనుభూతిని అందిస్తుంది. అలాగే, Bass Reflex Speaker డిజైన్ కారణంగా సపరేట్ సబ్‌ వూఫర్ లేకపోయినా శక్తివంతమైన బాస్‌ ను అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ S-Master డిజిటల్ యాంప్లిఫైయర్ ద్వారా స్పష్టమైన డైలాగ్‌, బ్యాలెన్స్‌డ్ ఆడియో మరియు తక్కువ డిస్టార్షన్‌ గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ Dolby Digital, Dolby Dual Mono మరియు LPCM 2 చానల్ ఆడియో ఫార్మాట్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ సింపుల్ సెటప్ లో సూపర్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది బ్లూటూత్ 4.2, HDMI ARC, ఆప్టికల్ ఆడియో ఇన్ పుట్ మరియు USB పోర్ట్ వంటి కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :