flipkart goat sale offers 10k big discount on latest 5.1.2 Dolby Atmos soundbar
జస్ట్ నెల క్రితం విడుదలైన 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ భారీ డిస్కౌంట్ అందించింది. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై జత చేసింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ చాలా తక్కువ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఇటీవలే విడుదలయ్యింది మరియు జబర్దస్త్ ఫీచర్స్ ఆకట్టుకుంటుంది.
జెబ్రోనిక్స్ రీసెంట్ సౌండ్ బార్ Juke Bar 9890 మోడల్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 29,999 పరిచే తో లాంచ్ అయ్యింది. ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందించి రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ICICI, BOB మరియు HSBC క్రెడిట్ కార్డు తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 23,499 సేల్ ప్రైస్ లో లభిస్తుంది.
Also Read: Samsung Galaxy Unpacked: కొత్త ఫోల్డబుల్ ఫోన్లు మరియు స్మార్ట్ వాచ్‌లపై భారీ అంచనాలు.!
మీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ను థియేటర్ స్థాయికి తీసుకెళ్లే ఫీచర్స్ తో ZEBRONICS ఈ లేటెస్ట్ Juke Bar 9890 సౌండ్ బార్ ను లాంచ్ చేసింది. ఇది ఒక ప్రీమియం 5.1.2-ఛానల్ Dolby Atmos మరియు DTS:X సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ టోటల్ 1030W RMS పవర్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సెటప్ లో 5 స్పీకర్ సౌండ్ బార్, పెద్ద ఉఫర్ కలిగిన వైర్‌లెస్ సబ్ వూఫర్ మరియు ట్రూ వైర్‌లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు ఉన్నాయి.
ఈ సౌండ్ బార్ 3D సరౌండ్ సౌండ్ అనుభూతి లభిస్తుంది. అలాగే, కంపెనీ అందించిన Zeb-Acousti Max మల్టీ డైమెన్షనల్ ఆడియో టెక్నాలజీ తో మరింత స్పష్టమైన సౌండ్ అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా కూడా ఈ సౌండ్ బార్ అనేక ఆధునిక ఫీచర్లతో వస్తుంది. ఇందులో HDMI eARC, ఆప్టికల్ IN, బ్లూటూత్ 5.3, USB మరియు AUX వంటి కనెక్షన్ ఆప్షన్లు ఉన్నాయి. LED డిస్‌ప్లే, రిమోట్ కంట్రోల్, వాల్ మౌంట్ సపోర్ట్, USB ద్వారా MP3 ప్లేబ్యాక్ వంటి సౌకర్యాలు కూడా ఈ సౌండ్ బార్ లో ఉన్నాయి.