Super Deal: బిగ్ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న పవర్ ఫుల్ 5.1 Dolby Soundbar

HIGHLIGHTS

కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్

5.1 Dolby Soundbar ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరకు ఆఫర్ చేస్తోంది

ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది

Super Deal: కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్ అందించింది. రీసెంట్ గా ఇండియాలో విడుదలైన పవర్ ఫుల్ 5.1 Dolby Soundbar ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో చవక ధరకు ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఆకట్టుకునే డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో అందుకోవచ్చు.

ఏమిటా 5.1 Dolby Soundbar డీల్

Boult గత సంవత్సరం చివరిలో రూ. 14,999 రూపాయల ధరతో విడుదల చేసిన Bassbox X500 5.1 డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు రూ. 3,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. వాస్తవానికి, ఇటీవల జరిగిన ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కూడా ఈ సౌండ్ బార్ రూ. 12,999 ధరకు సేల్ అయ్యింది.

అంతేకాదు, HSBC, Canara, HDFC మరియు BOBCARD క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే వారికి రూ. 1,199 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. వెరసి, ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 10,800 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇదే అతి తక్కువ ధర అవుతుంది.

Also Read: 4 వేల బడ్జెట్ లో Dolby Soundbar కోసం చూస్తున్నారా.!

Boult 5.1 Dolby Soundbar : ఫీచర్స్

ఈ బోల్ట్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 500W సౌండ్ అవుట్ ఫుట్ అందిస్తుంది. ఇందులో మూడు బూమ్ X స్పీకర్లు కలిగిన బార్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. అంతేకాదు, ఇందులో డెడికేటెడ్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసింగ్ (DSP) కూడా ఉంటుంది.

ఈ బోల్ట్ 500W పవర్ ఫుల్ సౌండ్ బార్ Dolby Audio సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ పెద్ద సైజు హాల్ ను సైతం షేక్ చేసేంత సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ USB, HDMI Arc, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :