flipkart announced huge price cut on samsung Dolby Atmos frame speaker
Price Cut: హెవీ సౌండ్ అందించే Samsung Dolby Atmos ఫ్రేమ్ స్పీకర్ సగం ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ లాంచ్ తర్వాత ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుందని తడుముకోకుండా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ ఇండియాలో 24 వేల రూపాయల ధరతో లాంచ్ అవ్వగా, ఈరోజు 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ మరియు UPI ఆఫర్ తో దాదాపు సగం ధరలో లభిస్తోంది. ఈ ఫ్రేమ్ స్పీకర్ కమ్ సౌండ్ బార్ డీల్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ స్పీకర్ కమ్ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
2025 మధ్య కాలంలో శాంసంగ్ రిలీజ్ చేసిన HW-LS60D/XL ఫ్రేమ్ స్పీకర్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ ప్రైస్ కట్ అందించింది. ఈ సౌండ్ బార్ ముందు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు కొన్ని నెలల తర్వాత ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది. శాంసంగ్ ఈ స్పీకర్ ను ఇండియాలో రూ. 23,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది.
ఫ్లిప్ కార్ట్ ఈ స్పీకర్ ను ఈరోజు రూ. 10,000 భారీ ప్రైస్ కట్ తో కేవలం రూ. 13,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫ్రేమ్ స్పీకర్ ను UPI ఆఫర్ లేదా Fedral బ్యాంకు క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేసి కొనుగోలు చేసే వారికి ఈ స్పీకర్ కేవలం రూ. 12,709 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది టాప్ అండ్ బెస్ట్ స్పీకర్ డీల్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఇది డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ మరియు బిల్ట్ ఇన్ ఉఫర్స్ తో వస్తుంది.
ఈ శాంసంగ్ బ్లూటూత్ స్పీకర్ ఆకర్షణీయమైన Music Frame డిజైన్ తో రూపొందించబడింది. ఇది ఇంటి అలంకరణ లో భాగంగా కనిపిస్తూనే ప్రీమియం ఆడియో అనుభూతిని అందిస్తుంది. ఇది 2.0 ఛానల్ ఆడియో సిస్టమ్ మరియు టోటల్ 6 స్పీకర్లతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫ్రేమ్ స్పీకర్ 120W శక్తివంతమైన సౌండ్ ను అందిస్తుంది. ఈ స్పీకర్ కలిగిన సౌండ్ టెక్ సపోర్ట్ చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
ఈ శాంసంగ్ ఫ్రేమ్ స్పీకర్ డాల్బీ అట్మోస్, డాల్బీ డిజిటల్ ప్లస్, Wide Sweet Spot, స్పేస్ ఫిట్ సౌండ్, అడాప్టివ్ సౌండ్ , Voice Enhance Mode, యాక్టివ్ వాయిస్ ఆమ్ప్లిఫైర్ మరియు నైట్ మోడ్ వంటి ఆధునిక ఆడియో టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది స్పష్టమైన డైలాగ్, సమతుల్యమైన బాస్ మరియు థియేటర్ స్థాయి సౌండ్ అనుభూతిని అందిస్తుంది. ఇది MP3, AAC, FLAC, WAV, ALAC, AIFF, OGG వంటి అనేక ఆడియో ఫార్మాట్ లకు సపోర్ట్ చేస్తుంది మరియు ఇందులో వివిధ రకాల సంగీతాన్ని క్వాలిటీ సౌండ్ తో ఆస్వాదించవచ్చు.
కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ స్పీకర్ లో బ్లూటూత్ 5.2, Wi-Fi సపోర్ట్, ఆప్టికల్ ఇన్ పుట్, క్రోమ్ క్యాస్ట్, ఆపిల్ ఎయిర్ ప్లే, Spotify కనెక్ట్, స్మార్ట్ థింగ్స్ యాప్ సపోర్ట్ మరియు Q-Symphony చాలా ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. అలాగే, అమెజాన్ Alexa, గూగుల్ అసిస్టెంట్, Bixby వాయిస్ అసిస్టెంట్ లతో కూడా పనిచేస్తుంది. అదనంగా, Samsung మొబైల్ వినియోగదారుల కోసం Tap Sound ఫీచర్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉండటం వల్ల ఫోన్ ను స్పీకర్ కు తాకిస్తే వెంటనే మ్యూజిక్ ప్లే అవుతుంది.
Also Read: Vivo T5 Lite : సెగ్మెంట్ బ్రైట్ డిస్ప్లే మరియు టర్బో బ్యాటరీతో లాంచ్ అవుతుంది.!
గోడకు అమర్చుకునే వాల్ మౌంట్ బ్రాకెట్ కూడా బాక్స్ లో లభిస్తుంది. స్టైలిష్ డిజైన్, వైర్‌లెస్ మ్యూజిక్ స్ట్రీమింగ్, స్మార్ట్ ఫీచర్లు మరియు శక్తివంతమైన డాల్బీ అట్మోస్ ఆడియోను కోరుకునే వినియోగదారులకు ఇది ఒక గొప్ప ఆప్షన్ గా నిలుస్తుంది.