సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో విడుదలైన Boult సౌండ్ బార్స్ 2.1 హోమ్ ఆడియో

సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో విడుదలైన Boult సౌండ్ బార్స్ 2.1 హోమ్ ఆడియో
HIGHLIGHTS

మిమ్మల్ని మంత్రముగ్దులను చేసే సరౌండ్-సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది.

బౌల్ట్ ఆడియో వారి తాజా ప్రోడక్ట్  ‘సౌండ్‌బార్స్ 2.1’ ను హోమ్ ఆడియో విభాగంలో ప్రవేశపెట్టింది. ఇది రూ .5,999 ధర తో ఉంటుంది. ఈ ప్రోడక్ట్  ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభిస్తుంది. దీన్ని పొడవైన ఒకే సౌండ్ బార్ గా లేదా విడదీసి టవర్ స్పీకర్లుగా కూడా వాడుకునేలా అందించింది. 

ఈ సౌండ్‌బార్స్‌లో HDMI పోర్ట్, AUX ఇన్‌పుట్ మరియు USB పోర్ట్ ఉన్నాయి, తద్వారా మీరు అనేక డివైజులను దీనితో కనెక్ట్ చేయవచ్చు. ఈ సౌండ్‌బార్ మరియు దాని వూఫర్ కూడా ఇన్‌స్టాల్ చేసిన గది యొక్క ఆకృతిని పెంచేంత సొగసైనదిగా కనిపిస్తాయి. ఇది 80 వాట్ల శక్తివంతమైన సౌండ్ అవుట్‌పుట్‌ తో మిమ్మల్ని మంత్రముగ్దులను చేసే సరౌండ్-సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది.

బౌల్ట్ యొక్క ఈ సౌండ్‌బార్స్‌లోని 2.1 ఛానల్ సరౌండ్ సౌండ్ మీకు సినీమా అనుభవాన్ని మీ టీవీకి అందిస్తుంది, మీకు ఇష్టమైన అన్ని కంటెంట్‌లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా ఇంట్లో నుండే సినిమా హల్ వంటి  వినోదాన్ని అనుభవించే విధానాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బౌల్ట్ సౌండ్‌బార్లు 80 వాట్ల RMS సౌండ్‌తో బాష్‌ఫుల్ వూఫర్‌తో వస్తుంది.

 ఇంకా ఈ సౌండ్‌బార్స్‌ ఒక డౌన్-ఫైరింగ్ వూఫర్‌తో వస్తుంది కాబట్టి, ఇది మీ మ్యూజిక్  అనుభవాన్ని మరింతగా పెంచుతుంది మరియు ఇది గదిలోని అన్ని ప్రాంతాలకి  సౌండ్‌ను విస్తరిస్తుంది. ఇది మీకు నిజంగా వినసొంపైన మరియు అనుభూతి చెందగల ఆడియో అనుభవాన్ని ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo