boAt Katana Blade: కొత్త ఫీచర్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్.!
త్త ఫీచర్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేస్తున్న బోట్
boAt Katana Blade పేరుతో వస్తున్న బడ్స్
కొత్త మెటల్ గ్లైడ్ మరియు RGB LED లైట్స్ తో విలక్షణమైన డిజైన్ తో అందించింది
ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ బోట్ నుండి కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ కాబోతున్నాయి. boAt Katana Blade పేరుతో వస్తున్నా ఈ బడ్స్ ఒక కొత్త ఆకర్షణీయమైన ఫీచర్ తో లాంచ్ కాబోతున్నాయి. కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్ తో వస్తున్న ఈ బడ్స్ చూడటానికి ఇయర్ బడ్స్ బాక్స్ మదిరా కాకుండా ఒక సరికొత్త డివైజ్ మాదిరిగా కనిపిస్తోంది. త్వరలో బోట్ లాంచ్ చేయబోతున్న ఈ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్లు ముందే తెలుసుకోండి.
SurveyboAt Immortal katana Blade
బోట్ అతి త్వరలో లాంచ్ చేయబుతున్న ఈ సరికొత్త ఇయర్ బడ్స్ ను రూ. 2,299 ధరలో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ బడ్స్ గన్ మెటల్ బ్లాక్ మరియు గ్రే రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ బోట్ ఇయర్ బడ్స్ అమేజాన్ మరియు బోట్ వెబ్సైట్ నుండి సేల్ కి అంధుబాటులోకి వస్తాయి.
Also Read : OnePlus AI Music Studio: చిటికెలో AI మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చేసే టూల్ తెచ్చిన వన్ ప్లస్.!
బోట్ కటనా బ్లేడ్ ఇయర్ బడ్స్ ప్రత్యేకతలు
బోట్ కటనా బ్లేడ్ ఇయర్ బడ్స్ ను కొత్త మెటల్ గ్లైడ్ మరియు RGB LED లైట్స్ తో విలక్షణమైన డిజైన్ తో అందించింది. ఈ బడ్స్ ను తెరిచేప్పుడు మెటల్ బ్లేడ్ తిప్పిన సౌండ్ వస్తుంది. ఈ ఎఫక్ట్ కోసం బాక్స్ లో స్పీకర్ ను అందించినట్లు బోట్ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ 13mm స్పీకర్స్ తో బోట్ సిగ్నేచర్ సౌండ్ తో వస్తుందని కూడా చెబుతోంది.

ఈ ఇయర్ బడ్స్ కలిగి ఉన్న ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ASAP ఛార్జ్ టెక్ మరియు 50ms లెటెన్సీ వంటి ఫీచర్స్ ఉన్నాయని కూడా తెలిపింది. ఈ బడ్స్ గరిష్టంగా 50 గంటల ప్లేబ్యాక్ ను అందించే సత్తా కలిగి వుంటాయని బోట్ గొప్పగా చెబుతోంది. ముఖ్యంగా, ఈ బడ్స్ ను ఓపెన్ చేసేప్పుడు ఇన్ బిల్ట్ స్పీకర్ వచ్చే బ్లేడ్ సౌండ్ మరియు నాలుగు వైపులా ఉన్న RGB లైట్స్ ఈ బడ్స్ కి ప్రధాన ఆకర్షణగా ఉంటాయని తెలిపింది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile