boAt launches Aavante Prime 5.1 5000 DA Dolby atmos sound under budget price
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ boAt ఈరోజు బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త సౌండ్ బార్ ను Aavante Prime 5.1 5000DA పేరుతో లాంచ్ చేసింది మరియు ఈరోజు నుంచి ఈ సౌండ్ బార్ ని సేల్ కి కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
బోట్ అవాంటే ప్రైమ్ 5.1 5000 DA సౌండ్ బార్ ను రూ. 14,999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ నుంచి Axis మరియు SBI క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను బోట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి బోట్ పే లేటర్ ఆప్షన్ తో వడ్డీ లేకుండా EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం అందించింది. Buy From Here
Also Read: Samsung 4K Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్.!
బోట్ సరికొత్తగా లాంచ్ చేసిన ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో మొత్తం ఆరు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు 6.5 ఇంచ్ ఉఫర్ స్పీకర్ కలిగిన సబ్ ఉఫర్ ఉంటాయి. బోట్ కొత్తగా లాంచ్ చేసిన ఈ సౌండ్ బార్ టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ కెపాసిటీ తో వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను ఇంటికి సరిపోయే ప్రీమియం డిజైన్ తో కూడా అందించింది.
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ బోట్ సౌండ్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI(e-ARC), AUX, బ్లూటూత్ వెర్షన్ 5.3, USB మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ పూర్తిగా వైర్ కనెక్టివిటీ తో వస్తుంది. సౌండ్ బార్ తో వచ్చే బాక్స్ లో వాల్ మౌంట్ కిట్, రిమోట్, పవర్ కేబుల్, Aux ఇన్ కేబుల్ AAA బ్యాటరీ లను అందిస్తుంది.