boAt Airdopes 111: ASAP ఫీచర్లతో 5 Min ఛార్జింగ్ తో 45 Min ప్లే బ్యాక్ అందిస్తుంది
boAt Airdopes 111 మంచి ఫీచర్లతో వచ్చింది
కేవలం 5 Min ఛార్జింగ్ తో 45 Min ప్లే బ్యాక్
నాలుగు కలర్ అప్షన్ లలో లభిస్తుంది
boAt ఇటీవల ఇండియాలో విడుదల చేసిన boAt Airdopes 111 ట్రూ బడ్స్ మంచి ఫీచర్లతో వచ్చింది. బోట్ ఎయిర్ డోప్స్ 11 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ASAP టెక్నలాజితో కేవలం 5 Min ఛార్జింగ్ తో 45 Min ప్లే బ్యాక్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. .ఈ TWS ఇయర్ బడ్స్ అందంగా కనిపించడమే కాకుండా 13mm డ్రైవర్స్ తో డీప్ బాస్ సౌండ్ అందిస్తుంది. బోట్ మార్కెట్లో కొత్తగా తీసుకొచ్చింది ఈ Airdopes 11 ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్ల గురించి ఇక్కడ చూడవచ్చు.
SurveyboAt Airdopes 111: ధర
boAt ఈ Airdopes 111 ని రూ.1,499 రూపాయల ధరతో ప్రకటించింది. ఈ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ బోట్ అధికారిక వెబ్సైట్, Flipkart మరియు Amazon లలో లభిస్తుంది. Airdopes 111 బడ్స్ ఓషియన్ బ్లూ, శాండ్ పెర్ల్, కార్బన్ బ్లాక్ మరియు స్నో వైట్ వంటి నాలుగు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
boAt Airdopes 111: ఫీచర్లు
boAt Airdopes 111: ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ 13mm డ్రైవర్స్ తో రిచ్ బాస్ మరియు క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఇందులో అందించిన ASAP ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 5 నిముషాల ఛార్జింగ్ తో 45 నిముషాలు ఆనందించవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ బడ్స్ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ తో 7 గంటల ప్లే బ్యాక్ మరియు బాక్స్ తో 21 గంటల ప్లే బ్యాక్ ను కలిపి మొత్తం 28 గంటల ప్లే బ్యాక్ సమయాన్ని అందిస్తుంది. అలాగే, ఇందులో క్విక్ రెస్పాన్స్ టచ్ కాంట్రొల్స్ మరియు వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను కూడా అందించింది. ఇది Bluetooth 5.1 కనెక్టివిటీ తో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile