boAt 5.2.4 Dolby Atmos today available at almost normal soundbar price
boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు దాదాపు నార్మల్ సౌండ్ బార్ రేటుకే లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రీసెంట్ బిగ్ సేల్ నుంచి కూడా 16 వేల రూపాయల ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు అన్ని ఆఫర్స్ అందుకుంటే, ఈ సౌండ్ బార్ కేవలం 13 వేల రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ధరలో ఈ సౌండ్ బార్ నిజంగా పరిశీలించ దగిన సౌండ్ బార్ ఆఫర్ గా నిలుస్తుంది.
బోట్ యొక్క 5.2.4 ఛానల్ డాల్బీ అట్మోస్ సౌండ్ బా మోడల్ Aavante Prime 6250DA ఈరోజు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 19,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రోజు రూ. 5,000 భారీ డిస్కౌంట్ తో రూ. 14,999 డిస్కౌంట్ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది.
ఈ సౌండ్ బార్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను Canara బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,250 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి కేవలం రూ. 13,749 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: Samsung 55 Mini LED స్మార్ట్ టీవీ అమెజాన్ బ్లాక్ బస్టర్ డీల్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
ఈ బోట్ సౌండ్ బార్ 5.2.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు మరియు పైన రెండు స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. అలాగే, డ్యూయల్ రియర్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ కూడా వస్తాయి. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెట్ తో జతగా డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ ని ఆఫర్ చేస్తుంది.
ఇక సౌండ్ బార్ అందించే టోటల్ సౌండ్ అవుట్ ఫుట్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ మొత్తంగా 625 W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI e-Arc, USB, ఆప్టికల్ ఇన్, బ్లూటూత్ మరియు AUX వంటి కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ ఫంక్షన్ రిమోట్ మరియు ప్రత్యేకమైన ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా ఉంటాయి.