Blaupunkt BE -50 నెక్ బ్యాండ్ తక్కువ ధరలో ఎక్కువ లాభాలను ఇస్తుంది

HIGHLIGHTS

ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు మీరు 12 గంటల వరకూ మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచ్చు.

Blaupunkt BE -50 నెక్ బ్యాండ్ తక్కువ ధరలో ఎక్కువ లాభాలను ఇస్తుంది

ఆడియో మరియు వీడియో ప్రొడక్స్ట్ తయారీలో ప్రముఖ సంస్థ అయినటువంటి Blaupunkt ఇండియాలో "BE -50 నెక్ బ్యాండ్" పేరుతొ ఒక సరికొత్త బ్లూటూత్ నేక్ బ్యాండ్ ని విడుదల చేసింది.   ఈ బ్లూటూత్ నేక్ బ్యాండ్ అత్యధికంగా 12 గంటల వరకు నిరాంతరంగా మ్యూజిక్ ని అందిచగలదు. అంటే, కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు మీరు 12 గంటల వరకూ మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BE -50 నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్  : ప్రత్యేకతలు

ఈ BE -50 నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఒక 10mm డ్రైవర్స్ తో పాటుగా వస్తాయి. ఇది HD క్వాలిటీ మరియు  గొప్ప డెప్త్ తో Boss ని మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక క్వాల్కామ్ ప్రాసెరుతో మరియు 150 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ BE -50 నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మీకు గరిష్టంగా 12 గంటల వరకూ నిరంతరంగా మ్యూజిక్ అందించే సామర్ధ్యంతో ఉంటుంది.

అంతేకాదు, వాటర్ మరియు డస్ట్ నుండి రక్షణ కూడా ఇందులో వుంది. ఎందుకంటే, ఇది IPX5 సర్ఫిఫికేషనుతో వస్తుంది. మరింతగా ఆకుట్టుకునే విశేషం ఏమిటంటే, ఇన్ని హంగులు వున్నా ఈ BE -50 నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కేవలం 25గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఇక ఈ BE -50 నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ధర విషయానికి వస్తే, ఇది రూ.1,499 రూపాయల ధరతో లాంచ్ చెయ్యబడింది మరియు అమేజాన్ ఇండియా ఆన్లైన్ ప్లాట్ఫారం పైన అందుబాటులో వుంది. ఈ ( LINK ) పైన Clik చెయ్యడంతో అమేజాన్ నుండి నేరుగా కొనవచ్చు.                 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo