బెస్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ : Rs. 1000 కంటే తక్కువ ధరలో
ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు.
బ్లూటూత్ హెడ్ ఫోన్ కొనాలంటే, మార్కెట్లో చాల తక్కువ ధరలో కూడా చాలానే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ మంచి సౌండ్ క్వాలిటీ మరియు ఎక్కువ సమయం పనిచేయగల 'బ్లూటూత్ హెడ్ ఫోన్స్' మాత్రం కొన్నే వున్నాయి. మరి అటువంటి వాటిలో 7 బెస్ట్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ గురించి ఈ రోజు ఇక్కడ చూద్దాం.
Survey1. Ant Audio Treble H86
M.R.P : Rs.999
UK కి చెందిన ఈ ఆడియో బ్రాండ్ , ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక పెద్ద 40mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి పవర్ ఫుల్ Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా 3.5 Aux తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు.
2. iBall Pulse BT4
M.R.P : Rs.1,299
తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా, iBall సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు.
3. iBall Musi Sway
M.R.P : Rs.1,799
iBall సంస్థ తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఒక పెద్ద 40 mm డ్రైవర్ తో వస్తుంది కాబట్టి Extra Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5 గంటల వరకూ నిరంతరాయంగా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు మంచి సవుతుండుతో మ్యూజిక్ ని ఆనందించడంతో పాటుగా, మీ మొబైల్ కాల్స్ కూడా అటెండ్ చెయ్యవచ్చు.
4. Wicked Audio WI-BT150
M.R.P : Rs.3,990
Wicked Audio నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ బాగా చేస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర హెడ్ ఫోన్ల కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన కలర్లలో లభిస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో సరౌండ్ సౌండ్ ని అందిస్తుంది.
5. Leaf Bass
M.R.P : Rs.1,999
ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ మంచి Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Bluetooth తో పాటుగా మైక్ తో కూడా వాడుకునేలా అందించారు. ఇందులో మీరు HD క్వాలిటీతో మ్యూజిక్ ని ఎంజాయ్ చెయ్యవచు. అలాగే, ఇది 10 గంటల పాటు మీకు నిరంతరంగా మ్యూజిక్ అందించే బ్యాటరీ శక్తితో వస్తుంది.
6. Nu Republic Starboy
M.R.P : Rs.2,999
ఈ అద్భుతమైన బ్లూటూత్ హెడ్ ఫోన్ చూడగానే అందరిని ఇట్టే ఆకర్షించే, స్టన్నింగ్ డిజైనుతో ఉంటుంది. ఇది ఒక X -Bass టెక్నాలజీతో వస్తుంది కాబట్టి, మీకు True -Bass ని అందిస్తుంది మరియు పాసివ్ నోయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విష్యం ఏమిటంటే, ఇది అత్యదికంగా 8 గంటల మ్యూజిక్/టాక్ టైం ని అందిస్తుంది.
7. PTron Kicks
M.R.P : Rs.2,500
Kotion నుండి వచ్చినటువంటి ఈ బ్లూటూత్ హెడ్ ఫోన్ కూడా మంచి సౌండ్ ని అందిస్తుంది. ఈ ధరలో ఇది ఉత్తమైన సౌండ్ అందిస్తున్నట్లు, ఇది పేరును సంపాదించుకుంది. ఇది ఒక మంచి డిజైనుతో పాటుగా మైక్ తో వస్తుంది కాబట్టి మ్యూజిక్ తో పాటుగామొబైల్ కాల్స్ కూడా అటెండ్ చేయోచ్చు.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile